తెలంగాణ

రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌గా రాజేశంగౌడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌గా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గొడిశల రాజేశం గౌడ్ నియమించినట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే ఆర్థిక సంఘం సభ్యుడిగా రంగారెడ్డి జిల్లా కొత్తపల్లికి చెందిన రిటైర్డు జడ్పీ సిఇఓ మొండ్యాగు చెన్నయ్య కురమను నియమించారు. వీరి నియామకానికి సంబంధించిన ఫైల్‌పై శుక్రవారం ముఖ్యమంత్రి సంతకం చేసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇతర సభ్యుల నియామకాన్ని త్వరలో ప్రకటించనున్నట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాజేశం గౌడ్, చెన్నయ్యకు ఇద్దరికీ పంచాయతీరాజ్ వ్యవస్థపై పూర్తి అవగాహన, అనుభవం ఉండటంతో వీరిని నియమించినట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
దివ్యాంగుల వివాహ ప్రోత్సహకం పెంపు
దివ్యాంగులకు ప్రభుత్వం ఇస్తున్న వివాహ ప్రోత్సహాకాన్ని రూ. 50 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచడానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేసారు.

చిత్రం..రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌గా నియమించినందుకు శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్న మాజీ మంత్రి రాజేశం గౌడ్