మెదక్

ఖేడ్‌లో టిఆర్‌ఎస్ నేతల ఇంటింటి ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట అర్బన్, జనవరి 21: నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు టిఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాలకు చెందిన పలువురు నేతలు టిఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టిఆర్‌ఎస్ రాష్ట్ర నేతలు వేలేటి రాధాకిషన్‌శర్మ, కరాటే కృష్ణ, నాగిరెడ్డి, శ్రీనివాస్ మాట్లాడుతూ నారాయణఖేడ్‌లో ప్రజలు టిఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఈ ఎన్నికల్లో అభివృద్ధికి నారాయణఖేడ్ ప్రజలు ఓటు వేయనున్నారన్నారు. ఇంటింటి ప్రచారంలో ప్రజలు టిఆర్‌ఎస్ పట్ల మంచి ఆదరణ చూపుతున్నారన్నారు. గతంలో ఉన్న నేతలు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. వరంగల్ ఉప ఎన్నికల ఫలితాలే నారాయణఖేడ్‌లో కూడా పునరావృతమైతాయన్నారు.