S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/22/2019 - 03:47

న్యూఢిల్లీ: శ్రీలంకలోని పలు ప్రాంతాల్లో ఆదివారం జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలను భారత్ తీవ్రంగా ఖండిస్తోందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. అదే సమయంలో ఉగ్రవాదాన్ని సమూలంగా పారదోలేందుకు ప్రపంచదేశాలన్నీ ముందుకు రావాలని భారత్ అభిలషిస్తోందని ఆమె పేర్కొన్నారు. కేంద్ర విదేశీ మంత్రి సుష్మా స్వరాజ్ తరఫున ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు.

04/22/2019 - 02:53

భద్రాచలం టౌన్, ఏప్రిల్ 21: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడు అడవుల్లో ఆదివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. పామేడు పోలీసు స్టేషన్ పరిధిలోని దండకారణ్యంలో తెలంగాణ గ్రేహౌండ్స్, చత్తీస్‌గఢ్ పోలీసులు మావోయిస్టుల కోసం సంయుక్త కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో వీరిని చూసిన మావోలు కాల్పులకు తెగబడ్డారు.

04/22/2019 - 02:50

భోపాల్, ఏప్రిల్ 21: అధికారంలోకి వస్తే దేశద్రోహ చట్టాన్ని రద్దు చేస్తానని తన ఎన్నికల మానిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం విరుచుకుపడ్డారు. బీజేపీ దేశ భద్రత కోసం అవసరమయితే మరిన్ని కఠినమయిన చట్టాలను తీసుకొస్తుందని ఆయన అన్నారు.

04/22/2019 - 02:17

అమేథీ (యూపీ), ఏప్రిల్ 21: ఎంపీగా ఎన్నికైన తర్వాత ఇప్పటివరకు తనను గెలిపించిన ప్రజలకు కనీసం ఒక్కసారి కూడా తన ముఖం చూపించకుండా తప్పించుకు తిరుగుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో వీడ్కోలు పలకాలని కేంద్ర టెక్స్‌టైల్స్ మంత్రి స్మృతి ఇరానీ ప్రజలకు పిలుపునిచ్చారు.

04/22/2019 - 02:15

బెంగళూరు, ఏప్రిల్ 21: లోక్‌సభ ఎన్నికల్లో తన తరఫున ప్రచారం చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని బెదిరిస్తున్నారని సినీ నటి సుమలత అంబరీష్ ఆరోపించారు. కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్‌డీ దేవెగౌడ్ కుమారుడు నిఖిల్ కుమార స్వామి పోటీ చేస్తున్న మాండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి సుమలత కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

04/22/2019 - 02:13

ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ప్రచారం రోజురోజుకీ తీవ్ర మవుతోంది. ఈ ఎన్నికల్లో గరిష్ట స్థాయిలో పోలింగ్ జరిగేలా ఈ చైతన్య కార్యక్రమాలు నమోదైన నేపథ్యంలో భోపాల్‌లో ఆదివారం ‘ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం’ అన్న నినాదంతో సైకిళ్లపై ప్రజలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.

04/22/2019 - 02:11

భోపాల్, ఏప్రిల్ 21: బీజేపీ భోపాల్ లోక్‌సభ నియోజవర్గ అభ్యర్థి, మాలెగావ్ బాంబు పేలుళ్లలో నిందితురాలు ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు ఎన్నికల కమిషన్ మరో షోకాజు నోటీసు జారీ చేసింది. అయోధ్యలో వివాదాస్పద బాబ్రీ మసీదు విధ్వంసంలో పాలుపంచుకున్నందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని ఆమె చేసిన వ్యాఖ్యలపై ఈసీ ఈ నోటీసు జారీ చేసింది.

04/22/2019 - 02:10

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: లైంగిక దాడుల కేసుల దర్యాప్తులో భాగం గా తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించడానికి వీలుగా రక్తం, వీర్యం నమూనాలను సేకరించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 3,100కు పైగా ప్రత్యేక కిట్‌లను పంపిణీ చేసిందని అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి.

04/22/2019 - 02:08

ధనోరా (ఛంద్వారా), ఏప్రిల్ 21: ఛింద్వారా లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే బాధ్యతను తాను తన కుమారుడు నకుల్‌కు అప్పగించానని, ఒకవేళ బాధ్యతల నిర్వహణలో అతను విఫలమయితే, అతని దుస్తులు చించివేయాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ప్రజలకు పిలుపునిచ్చారు. కమల్‌నాథ్ కుమారుడు నకుల్ నాథ్ తొలిసారి ఛింద్వారా లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

04/22/2019 - 02:07

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: శ్రీ లంకలో ఈస్టర్ రోజు జరిగిన దారుణ నరమేధాన్ని అత్యంత హేయమైన అటవిక చర్యగా భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర పదజాలంతో ఖండించారు. 160 మందిని బలిగొన్న ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన తన ప్రగాఢ సంతాపం తెలిపారు. శ్రీ లంక ప్రజలకు తాము అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.

Pages