S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాస్కర వాణి

12/20/2019 - 05:41

పాకిస్తాన్ తన మిస్సైల్స్‌కు తైమూర్, అబ్దాలీ వంటి నరరూప రాక్షసుల పేర్లు పెట్టుకున్నది. హిందూస్తాన్‌లో విలయ విధ్వంసం సృష్టించిన మహమ్మద్ ఘోరీ పేరును తన క్షిపణులకు నామకరణం చేసింది. అలాగే కాంగ్రెస్‌ను వెనుకనుండి నడిపించే గులాం నబీ ఆజాద్ తన కొడుకుకు ఔరంగజేబు అని పేరు పెట్టుకొన్నాడు. ఈ నబీ కనుసన్నల్లో నడిచే కాంగ్రెస్ నుండి ‘క్యాబ్’ బిల్లుపై రగడ చూసాక ఇంతకన్నా ‘ఇంకేం చూస్తాం’ అనిపిస్తుంది.

12/13/2019 - 03:39

రెండవసారి అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక్కో పనిని చాలా జాగ్రత్తగా పూర్తిచేయడం మొదలుపెట్టింది. కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు, అయోధ్య వివాదంపై తీర్పును త్వరితగతిన ఇప్పించడం.. తాజాగా పౌరసత్వ సవరణ బిల్లు.. ఇలా ఒక్కో అడుగు ముందుకేస్తుంటే ప్రతిపక్షాలు కుడితిలో పడ్డ ఎలుకల్లా కొట్టుకొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు, పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించింది.

12/10/2019 - 23:30

మారువేషంలో మారీచుడు మాయలేడిగా వచ్చా డు.. ఆ ‘బంగరు జింక’పై సీత మనసు పడింది. దానిని వేటాడుతూ.. వెంటాడుతూ శ్రీరాముడు పరుగెత్తాడు. మరో వేషంలో మైరావణుడు పర్ణశాల ముందు నిలబడి ‘్భక్షాందేహీ..!’ అన్నాడు. సీత శంకించింది.. అయినా సాధు స్వభావంతో ఆమె ‘లక్ష్మణరేఖ’ దాటింది. అతని అసలు రూపం బయటపడింది. సీత లక్ష్మణరేఖ దాటాక గాని రావణబ్రహ్మ నిజస్వరూపం బయటపడలేదు. రావణుడు త్రేతాయుగం నాటి కిడ్నాపర్, రేపిస్ట్.

11/22/2019 - 05:15

‘ఒంగోలులో ఇంటర్మీడియట్ చదువుకుంటున్నపుడు మొదటిసారి జార్జిరెడ్డి గురించి వి న్నాను. మళ్లీ ఇపుడు వింటున్నా. ఆయన గురించి తెలుసుకొన్నపుడు ఎంతో ఆశ్చర్యం వేసింది. ఆయనపై సినిమా రావడం చాలా ఆనందంగా వుంది. ఇలాంటి అగ్రెస్సివ్ వ్యక్తుల జీవితాలు తెరపైకి రావాలి’.. ఈ ఆణిముత్యాలు పలికిన మహనీయుడు మెగాస్టార్ చిరంజీవి.

11/15/2019 - 01:29

ఈనెల 9వ తేదీన అయోధ్య వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన వెం టనే కొంత సంతోషం, అసహనం, ఆనందం, వ్యతిరేకత.. అన్నీ ఒక్కసారి వ్యక్తం అయ్యాయి. శ్రీరామ సంస్కృతిని ఆరాధించేవారు ఆనందాన్ని వ్యక్తం చేస్తే, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఓవైసీ సహా ఒకరిద్దరు తప్ప- ఎక్కడా పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు.

11/08/2019 - 01:54

సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ 550వ జయంతి నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యంతో ఇండియా-పాక్ సరిహద్దులో 4.7 కిలోమీటర్ల దూరంలో ‘కర్తార్‌పూర్ కారిడార్’ నిర్మాణం జరిగింది. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి పాకిస్తాన్ విడుదల చేసిన ఓ వీడియోతో వివాదం చెలరేగుతున్నది.

10/25/2019 - 00:44

ప్రపంచంలో చాలా జాతులు, మతాలు, దేశాలు, సంస్కృతులు బానిసత్వంలో పదేళ్ల నుండి వం ద సంవత్సరాలు ఉంటే వాటి అస్తిత్వం కోల్పోయాయి. రెండు భిన్నమైన భాషలు గల ప్రజలు 50 ఏళ్ళు కలిసి ఉండలేకపోయారు. పాకిస్తాన్-బంగ్లాదేశ్‌లే ఇందు కు ఉదాహరణ. రాజకీయ సామాజిక ఉద్యమాలు జరిగిన తర్వాత మరికొన్ని దేశాలు తమ అస్తిత్వం వదిలేసుకోవలసి వచ్చింది. బలమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక శక్తిగల రష్యా ఎన్ని ముక్కలైందో మనకు తెలుసు.

10/18/2019 - 01:26

సీతమ్మ వారి పుట్టిల్లు ఇపుడు నేపాల్‌లోని జనకపురి. జనకపురి-అయోధ్యల మధ్య ఓ గొప్ప సాంస్కృతిక బంధం ఉండేది. సీతమ్మ వారి తల్లిగారింటి నుండి కొన్ని అణాలు కానుకల రూపంలో నేపాల్ రాజ్యం నుండి అయోధ్యకు వచ్చేవి. ఆ కానుకలు పంపేటపుడు మందీ మార్బలంతో, గొప్ప ఊరేగింపుతో అక్కడివారు పంపితే స్వయంగా అయోధ్య ప్రాంతంలోని ఫైజాబాద్ కలెక్టర్ స్వయంగా వెళ్లి ఎదుర్కొని వాటిని తెచ్చేవారు.

10/11/2019 - 01:13

ఒకప్పుడు దేశంలో ప్రఖ్యాతి చెందిన ‘బ్లిట్జ్’ పత్రికలో విచిత్రమైన ద్వంద్వవైఖరి ఉండేది. ఆ పత్రిక ఆనాటి కాంగ్రెస్ విధానాలను తూర్పారబట్టేది. ఆ రోజుల్లో అది ఎక్కువ సర్క్యులేషన్ వున్న పత్రిక. ఓ వైపు కాంగ్రెస్‌ను తిడుతూ జవహర్‌లాల్ నెహ్రూపై అపార ప్రేమను కురిపించేది. నెహ్రూతోపాటు ఆయన క్యాబినెట్‌లోని కృష్ణమీనన్ లాంటి ప్రచ్ఛన్న కమ్యూనిస్టులను భుజాన మోసేది.

10/04/2019 - 02:09

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘హిందీ జాతీయ భాష’గా ఉంటే బాగుంటుందని ఇటీవల ప్రకటించారు. వెంటనే భాషావేత్తలు, మేధావులు, కుల భాషావాదులు, వారి విషపత్రికలు కత్తీడాలూ సర్దుకొని పాత మసాలాను మరోసారి రోట్లోవేసి దంచి ‘ఉత్తరాది-దక్షిణాది’ అంటూ గగ్గోలు పెట్టడం మొదలైంది. ఎనలేని ప్రాంతీయ, మాతృభాషాభిమానాన్ని ఒలకబోస్తూ తెలుగునాట చర్చోపచర్చలు మొదలుపెట్టారు.

Pages