S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/24/2019 - 17:41

విజయవాడ: ఏపీ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదీ గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరారు. ఆయనతో భేటీ అయిన సందర్భంలో ఏపీలో గెలిచిన అభ్యర్థుల వివరాలు ఇవ్వనున్నారు. ఆయన ఇచ్చిన జాబితాను బట్టి గవర్నర్ జగన్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని కోరతారు.

05/24/2019 - 16:44

విశాఖపట్నం:విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన ఫలితంపై నెలకొన్న ఉత్కంఠ తీరంది. ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు విజయం సాధించినట్లు అధికారులు వెల్లడించారు. గురువారం రాత్రి వీవీప్యాట్‌లను లెక్కించే సమయంలో అందులో పోలైన ఓట్లపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఎన్నికల ఫలితాలను నిలిపివేశారు. ఈ విషయంలో ఈసీని సంప్రదించి గంటా విజయాన్ని అధికారులు ఈరోజు ప్రకటించారు.

05/24/2019 - 16:43

అమరావతి: ఏపీ రాజధాని సెక్రటేరియట్‌లో మంత్రుల నేమ్‌ప్లేట్స్ తొలగించారు. పరిపాలన శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సిబ్బంది వివిధ మంత్రుల నేమ్‌ప్లేట్స్ తొలగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫొటోలను సైతం తొలగించారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలై వైకాపా 175 అసెంబ్లీ స్థానాలకుగాను 151 స్థానాలను కైవసం చేసుకున్న విషయం విదితమే.

05/24/2019 - 04:33

విజయవాడ, మే 23: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్యమైన మెజారిటీ లభించడంతో వైకాపా అధినేత జగన్‌కు విశాఖ శారదీపీఠానికి చెందిన స్వరూపానంద్రేంద్ర సర్వసతీ మహాస్వామి ఆశీస్సులు అందచేశారు. ఎన్నికల ఫలితాల్లో ముందంజలో ఉండటంతో స్వామివారికి గురువారం జగన్ ఫోన్ చేసి మాట్లాడారు. స్వామి వారి ఆశీస్సులతో విజయం సాధించినట్లు చెప్పారు.

05/24/2019 - 04:32

విజయవాడ, మే 23: అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి వైకాపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని తేలడంతో ఆ పార్టీ అధినేత జగన్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లిన సీఎస్.. ఆయనను అభినందించారు. తాజా రాజకీయ పరిణామాల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలిసింది.

05/24/2019 - 04:32

హైదరాబాద్, మే 23: దక్షిణ మధ్య రైల్వేలో ఆధునిక సాంకేతిక వ్యవస్థతో సిగ్నల్ వైఫల్యాలు ముందస్తుగా గుర్తించే విధానం విజయవంతమైందని రైల్వే అధికారులు తెలిపారు. ముందుగా గుంటూరు రైల్వే డివిజన్‌లో దాదాపు 63 రైల్వే స్టేషన్లలో డిజిటల్ సర్వలెన్స్ ప్యానళ్లు ఏర్పాటు చేశారు. సిగ్నల్ వైఫల్యాలు సంభవించే సమయంలో డాటా లాగర్స్‌తో కనిపెట్టి సరిదిద్దే వ్యవస్థ విజయవంతం కావడంతో రైల్వే అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

05/24/2019 - 03:54

పులివెందుల, మే 23: ఎన్నికల్లో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఘన విజయం సాధించడంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పులివెందులలో వైకాపా అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. గురువారం ఉదయం నుంచి వైకాపా భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తుండడంతో జనం, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉదయం నుంచే రోడ్లపైకి చేరుకుని సంబరాలు జరుపుకున్నారు.

05/24/2019 - 03:44

నంద్యాల, మే 23: వైఎస్ కుటుంబం చేతిలో టీడీపీ ముచ్చటగా మూడుసార్లు పరాభవం పాలైంది. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఏపీలో ఫ్యాన్ గాలి జోరుకు సైకిల్ కొట్టుకుపోవడంతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబం చేతిలో చంద్రబాబుకు మూడవ ఓటమి తప్పనిసరైంది. 2004 సార్వత్రిక ఎన్నికల్లో రాజశేఖర్‌రెడ్డి చేతిలో ఘోర పరాజయం చవిచూసిన చంద్రబాబునాయుడు, 2009లోనూ వైఎస్ చేతిలో ఓటమిపాలయ్యారు.

05/24/2019 - 03:42

భీమవరం, మే 23: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు పశ్చిమ గోదావరి జిల్లాలో చేదు అనుభవం మిగిలింది. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేసిన ఆయన గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఓటమి చెందారు. ఈ నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్‌ను ఓడించడం ద్వారా వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ సంచలనం సృష్టించారు. నామినేషన్ల దాఖలు సమయంలో ఆకస్మికంగా భీమవరం జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పేరు తెరపైకి వచ్చింది.

05/24/2019 - 03:40

కడప, మే 23: కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన టీడీపీ నేతలకు ఈ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. ఎంపీగా పోటీచేసిన మంత్రి ఆదినారాయణ ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొంది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి మారి మంత్రి పదవి చేపట్టిన సీ.ఆదినారాయణరెడ్డికి ఈ ఎన్నికల్లో ఊహించని ఓటమి ఎదురైంది.

Pages