S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/20/2017 - 03:44

నిజామాబాద్/ కరీంనగర్/ నల్లగొండ/ వరంగల్/ ఆదిలాబాద్, ఆగస్టు 19: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయ. కరీంనగర్ జిల్లాలో శనివారం ఎడెనిమిది మండలాల్లో భారీ వర్షాలు కురవగా, మిగిలిన మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.

08/20/2017 - 03:42

హైదరాబాద్, ఆగస్టు 19: దేశంలో ఎక్కడ బాంబు దాడులు జరిగినా దాని మూలాలకు సంబంధించి లింక్ హైదరాబాద్‌లో ఉంటోందని విశ్వ హిందూ పరిషత్ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేందర్ జైన్ పేర్కొన్నారు. కాచిగూడ గుజరాతీ భవన్‌లో భజరంగ్ దళ్ జాతీయ కార్యవర్గ సమావేశాలలో పాల్గొన్న సురేందర్ జైన్ పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సమావేశాల ముగింపు సభ కాచిగూడ మున్నూరు కాపు సంఘం హాలులో జరగనుంది.

08/20/2017 - 04:03

నిజామాబాద్, ఆగస్టు 19: రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు భారతీయ జనతా పార్టీ కృషి చేస్తోందని, ఈ దిశగా తమ పార్టీ అత్యంగా వేగంగా విస్తరిస్తోందని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.

08/20/2017 - 03:39

వరంగల్, ఆగస్టు 19: ప్రభుత్వం కల్పిస్తున్న వౌలిక వసతులు, సదుపాయాల కారణంగా రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటవుతున్నా నైపుణ్యం లేని కారణంగా రాష్ట్రానికి చెందిన యువతకు ఉద్యోగావకాశాలు పూర్తిస్థాయిలో లభించటం లేదని టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) ముఖ్య కార్యనిర్వహణాధికారి సుజిత్ నాయక్ తెలిపారు.

08/20/2017 - 03:33

హైదరాబాద్, ఆగస్టు 19: ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవి శంకర్ దేశవ్యాప్తంగా ఒకేసారి సుమారు లక్ష మందితో యోగ, ప్రాణాయామం చేయించి రికార్డు సృష్టించారు. శనివారం టివీ ద్వారా రవి శంకర్ ప్రాణాయామం, యోగ గురించి తెలిపారు.

08/20/2017 - 03:32

హైదరాబాద్, ఆగస్టు 19: పోలీస్ శాఖలో 1989-91 బ్యాచ్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్లుగా నియామకం అయినవారు శనివారం సచివాలయంలో హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మను కలిసి తమకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. ఈ బ్యాచ్‌కు చెందిన వారికి ఇప్పటి వరకు సిఐలుగా ప్రమోషన్ లభించింది.

08/20/2017 - 03:31

హైదరాబాద్, ఆగస్టు 19: తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగాయని, ప్రభుత్వం కూడా పరోక్షంగా మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తోందని శనివారం నాడిక్కడ జరిగిన విద్యావంతుల చైతన్య వేదిక సదస్సులో వక్తలు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మద్యం నియంత్రణకే పరిమితం కాకుండా నిషేధించాలని వేదిక కోరింది.

08/20/2017 - 03:31

హైదరాబాద్, ఆగస్టు 19: రాష్ట్రానికి రావలసిన ఐటిఐఆర్ ప్రాజెక్టు, ఉద్యోగాలూ ఏమయ్యాయని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మూడేళ్ళ పాలనలో రాష్ట్రం అవినీతికి, అక్రమాలకు, మాఫియాలకు అడ్డాగా మారిందని ఆయన విమర్శించారు. శంషాబాద్ మండలంలోని మదనపల్లిలోని శనీశ్వరాలయంలో శనివారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

08/20/2017 - 03:30

హైదరాబాద్, ఆగస్టు 19: మెట్రోరైలును వచ్చే నవంబర్ నెలాఖరులోగా ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే అమీర్‌పేట మైత్రివనం ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ పనులతో పాటు ఇతర పలు ప్రాంతాల్లో ఆహార్నిశలు పనులు జరుగుతున్నాయి.

08/20/2017 - 03:28

హైదరాబాద్, ఆగస్టు 19: మహిళల రక్షణకు ప్రత్యేకంగా ‘మహిళా హెల్ప్‌లైన్-181’ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మహిళలకు సలహాలు ఇచ్చేందుకు, కౌన్సిలింగ్ నిర్వహించేందుకు, రక్షణ కోసం ఈ హెల్ప్‌లైన్ ఉపయోగపడుతుంది. రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఈ హెల్ప్‌లైన్‌ను సచివాలయంలో ప్రారంభించారు.

Pages