S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెన్నెల

నాకు నచ్చిన పాట .. రాగమరుూ రావే

తెలుగు పాటకు ప్రత్యేక గౌరవం కల్గించి పట్ట్భాషేకం చేయడం, సాహిత్యానికి, సంగీతానికి, గాత్రానికి ప్రథమ తాంబూలం ఇవ్వడంవంటి సర్వోన్నతమైన క్రియలు చేయడానికి సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు జయభేరి చిత్రాన్ని ఆలంబనగా చేసుకున్నారని చెప్పడానికి ఏ మాత్రం సంకోచపడాల్సిన అవసరం లేదు. ఈ చిత్రంలో ప్రత పాట ఓ ఆణిముత్యం. ఏ పాటను కూడా తక్కువ చేసి చెప్పలేం. కాకపోతే హాయిగా పాడుకోవడానికి వీలైన ‘రాగమరుూ రావే/ అనురాగమరుూ రావే/ నీలాల గగనాన నిండిన వెనె్నల/ నీ చిరునవ్వుల కలకలలాడగ’ పాట హాయిగా వుంటుంది. 1959లో విడుదలైన ఈ సినిమాలో ఘంటసాల గాత్ర విశ్వరూపం, పెండ్యాలవారి స్వరనైపుణ్యం, మల్లాది జానుతెనుగు పదాల సోయగం, నటీనటుల హావభావాలు కలగలసి పాలు, చెరుకురసం, తేనె, పంచదార మిశ్రమంలా ఉండి చెవులకే కాదు పెదాలకు తీయందనాన్ని అందిస్తుంది. అన్నీ కలగలసి ఈ చిత్రాన్ని జయభేరి మ్రోగించాయి. గాయనీ గాయకులు కవి, సంగీత దర్శకుల స్థాయిని అందుకుని అంతకన్నా ఎక్కువగా పాటను గానం చేశారు. ‘చివురులు మేసిన చిన్నారి కోయిల మరి మరి మురిసె మాధురి నీవే’ అన్న మొదటి చరణం రికార్డుల్లో వినపడదు. అయితే 1980లో విడుదలైనప్పుడు పూర్తి పాట వుంటుంది. చిన్నారి కోయిలలు, మరుమల్లెలు, విరజాజులు, నెలరాయుడు, కలువలు, జిలుగు, పరిమళం, పులకరింతలు, కలవరింతలు లాంటి పదాలు తేనెలో ముంచి నోటికందించినట్లు ఉంటాయి. అభేరి రాగంలో పాటను స్వరపరిచి రసిక జనుల హృదయాలను రసభరితం చేశారు పెండ్యాల. అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవిపై చిత్రీకరించిన ఈ పాట అద్భుతమైన గీతంగా ఇప్పటికీ సినిమాప్రియుల ఆదరణ పొందుతోంది.

-నీలం శివగంగాధర, వీరపునాయినిపల్లె
.............................

k

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

ప ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
ప రచనల్లో కొత్తదనం ముఖ్యం
ప అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.
ప కొత్త సినిమాలపై సమీక్షలు రాయాలనుకున్న ఔత్సాహికులు ముందుగా ఒకటి రెండు సమీక్షలు పరిశీలన కోసం రాసి పంపితే, పరిశీలించగలం.
ప తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే కొత్తసినిమాలను పరిశీలించే ఆసక్తి వున్నవారు, సంబంధిత వ్యాసాలు పంపితే అవీ ప్రచురణార్హమే.
ప కొత్త హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వ్యాసాలకు కూడా స్వాగతం.
ప ఇంతవరకు ఎక్కడా ప్రచురితం కాని, అపురూప చిత్రాలువుంటే పంపొచ్చు.
ప రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో పళశశళ్ఘబజూళషష్ఘశ్ఘౄజ.ష్యౄకు మెయల్ చేయగలరు.
ప ప్రచురించిన (మీ వ్యూస్ మినహా) ప్రతి వ్యాసానికి పారితోషికం వుంటుంది.

మా చిరునామా :
ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03