S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Others
తనో..
అక్షర యోధుడు
తనో..
అక్షర వేటగాడు
తనో..
అక్షర శిల్పి
తనో.. అక్షర విలుకాడు
తనో..
అక్షర సముద్రం
తనో..
అక్షయ పాత్ర
తనో..
అక్షర ఆకాశం
తనో..
అక్షర సునామి
తనో..
అక్షర తుఫాన్
తనో..
అక్షర బడబాగ్ని
తనో..
అక్షర అగ్నిపర్వతం
*
పడమటి తీరం కన్నులెర్రబారి చూస్తూ.. విస్తుపోతోంది.
నేనెవరంటే..
నిశ్శబ్దం ఒకటే నిజమైన సమాధానం అని.
గలగల గవ్వల్లా
చిటికెలేసినట్లు
మాటలు సవ్వడి చేసి
శబ్దాన్ని కొనితెచ్చినా
మాటల ప్రయోజనం
నిశ్శబ్దాన్ని సృష్టించడమే సుఖుడా..!
వౌనప్రార్థన చేస్తున్నట్లు కనిపిస్తున్న
గొప్ప రూపం అదే!
ఒక్క మెత్తని పిలుపు
వౌనంలోనే వినపడితే చాలు.
పాత పుస్తకం చుట్టూ
దోమ చెక్కర్లు కొడుతుంది
దానిలో రక్తమాంసాలు
ఇంకా తాజాగానే ఉన్నాయి
ప్రాచీన గాథలన్నీ
నిశ్శబ్దంగానే వుంటాయి
కాలం మింగేసినవి పోగా
ఇప్పటికీ శబ్దిస్తున్నాయి.
సాలార్‌జంగ్ మ్యూజియంలో
ఆ కవచాన్ని
చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను
వింటే దాని ఛాతీలోంచి
యుద్ధాలు వినిపిస్తాయి.
నేడు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, కథక చక్రవర్తి మునిపల్లె రాజు 95వ జయంతి.
వారిని గురించి విశ్వర్షి వాసిలిగారి మధుర జ్ఞాపకాలు కొన్ని..
**
ముని...పల్లె...రాజు మూడు పదాల సంగమం. కాదు కాదు, మూడు భావాల సంయోగం.
అదే సూర్యుడు అదే చంద్రుడు
అదే కాంతి అదే చీకటి
రోజులు ఖుషిగా కాలర్ ఎత్తుకు నడిచిపోతూ ఉండేవి
* * *
చిన్నప్పుడు
బడికి గుడికి పోదాం అనుకున్నప్పుడు
అరికాళ్ళలో ముల్లు విరిగి
విలవిలలాడి పోయాను
కాళ్లకు చెప్పుల రక్షణ లేవు
తరగతిలో చేతులకు
ఎప్పుడూ మైదాకుతో మెహర్నిసాబేగం
మసీదులో రోజూ మబ్బుల
నమాజ్ చేసే యాకూబ్
మూసుకున్న కనురెప్పల మాటున
కల ‘వరమవుతున్న’
విశ్రాంత సమయాలను
జోకొడుతుంది
కోరుకున్నదందక పగిలిన
మనసు ముక్కల్ని అతికించే పనికే
పునరంకితమైనట్లుంటుంది.
నిన్ను వదిలెళ్లిపోయిన స్నేహఋతువుని
బుజ్జగించి కొత్త అంకుర నిర్మాణానికి ప్రోత్సహిస్తూ
ఏకాంత ఆత్మావలోకనకు పురిగొల్పి
ప్రకృతిని సైతం సడిసేయవద్దంటూ
సమాధి స్థితిని ప్రోత్సహిస్తుంది.
ఉర్దూ భాషలో గులాబిపువ్వై గుబాళించెను మఖ్దూం
గజల్ సొగసుల బాహార్ తానై పసందు చేసెను మఖ్దూం
గుల్ మొహర్‌లా ప్యార్ గజల్‌లా ఖుషీలు ఎన్నో చేసి
ముషాయిరాల నవాబులాగ ప్రకాశించెను మఖ్దూం
మైఖాద్‌లాగ మత్తెక్కించే షేర్‌లను మాత్రమే కదా
ఉడుకెత్తించే నెత్తుటి గీతం తానై వెలిగెను మఖ్దూం
ఒకప్పుడు యాక్సిడెంటును చూస్తే
మనసు దిగ్భ్రమ చెందేది.
తెరిచి వున్న శవం కళ్లు
ఇంటిదాకా వెంటాడేవి.
మృత్యువును ప్రత్యక్షంగా చూసిన
జలదరింపు కలిగేది
ఆ వ్యక్తి స్థానంలో
మనముంటే అన్న భావన భయపెట్టేది
కొన్నాళ్ల దాకా
అన్నం సయించేది కాదు.
మరి ఇప్పుడు!
ప్రమాదాలు సాధారణమైపొయ్యాయి
తప్పెవరిది అన్న విశే్లషణ
ముఖ్యమయ్యింది.
ఎడారిలో పూల వర్షంలా
రాలుతున్న నక్షత్రాలను నా చేతులు
ఆనందంగా స్వీకరిస్తున్నాయి
ఇప్పుడు నాకు భయం లేదు
ఎండుటాకులపై ఒక పదఘట్టన
బహుశా ప్రియురాలి పలకరింపు కావచ్చు
లేదా - ఒక్కసారిగా విరుచుకుపడ్డ
అగ్ని సర్పం స్పర్శ కావచ్చు
అయినా నాకు ఇప్పుడు భయం లేదు
నిస్తేజం శాఖోపశాఖలుగా విస్తరించిన
నా శరీరం దాహాగ్ని కుసుమం కోసం
ఎదురుచూస్తోంది
ఉన్నపళంగా
ఆశల దారాలు తెగిపోతాయి
మనసు గాలిపటం
ఊహల ఆకాశాన్ని వదిలి
నేలకు రాలిపోతుంది
నిశ్శబ్దాన్ని మింగిన మేఘమొకటి
అంతకంతకూ విస్తరిస్తుంది
శూన్యం తన గుహలాంటి నోరు తెరిచి
అమాంతం
ఆత్మవిశ్వాసాన్ని మింగేయాలని చూస్తుంది
కొడిగట్టిన ఆత్మస్థైర్యపు దీపం
గాలిలో రెపరెప లాడుతుంటుంది!
ఒక సందిగ్ధంలో
ఆలోచనలు లోలకంలా ఊగుతుంటాయి