S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/25/2018 - 04:51

సిద్దిపేట, ఏప్రిల్ 24: ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ పెద్దలు ఒప్పుకోకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ప్రేమికుడు క్రిమీసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడుతుండగా, కాపాడే యత్నంలోప్రియురాలు అస్వస్థకు గురైన సంఘటన సోమవారం రాత్రి సిద్దిపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

04/25/2018 - 04:50

మెదక్ టౌన్, ఏప్రిల్ 24: నాన్ బెయలేబుల్ వారంట్ జారీతో పతంజలి ఉత్పాదకాల సీఈఓ ఆచార్య బాలకృష్ణ మంగళవారం మెదక్ మొదటి అదనపు కోర్టుకు హాజరయ్యారు.

04/25/2018 - 04:45

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 24: పాత ఇంటిని కూల్చివేస్తుండగా ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా స్లాబ్ పడిపోవడంతో కూలీ అక్కడికక్కడే చనిపోగా మరో కూలీ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైనాడు. నష్టపరిహారం కోసం మృతుని బంధువులు ఆందోళనకు దిగడంతో కొంతసేపు గందరగోళం ఏర్పడింది.

04/25/2018 - 04:20

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: అత్యాచార బాధితులు వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించడానికి వీల్లేదని సుప్రీం కోర్టు నిర్ద్వంద్వంగా తేల్చిచెప్పింది. చివరికి మరణించినవారికి కూడా గౌరవం ఉంటుందని, వారిని బజారుకు ఈడ్చడానికి వీలులేదని, అత్యాచార బాధితుల వివరాలు వెల్లడికి సంబంధించి అంశాన్ని విచారించిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

04/25/2018 - 03:42

ఓబుళదేవరచెరువు, ఏప్రిల్ 24: పెళ్లి బృందం ట్రాక్టర్‌ను లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా ఓబులదేవరచెరువు మండలం గాజుకుంటపల్లి వద్ద మంగళవారం రాత్రి 9.30 ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో లక్ష్మమ్మ(45), నాగేశ్వరి(13), కార్తీక్(13), మంజునాధ్(12) అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి.

04/25/2018 - 03:39

హైదరాబాద్, ఏప్రిల్ 24: వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి 600 నోటిఫికేషన్లలో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం మంజూరుపై ఏప్రిల్ 30వ తేదీ లోపల లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని హైకోర్టు ఆంధ్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భూసేకరణ వల్ల నష్టపోయిన కుటుంబాల జాబితాను రూపొందించడంలో ఏపి ప్రభుత్వాధికారులు అవలంభించిన వైఖరిని హైకోర్టు తప్పుబట్టింది.

04/25/2018 - 03:26

పెడన, ఏప్రిల్ 24: అవినీతి నిరోధక శాఖ అధికారులు మరో అవినీతి చేపను పట్టుకున్నారు. వ్యవసాయ భూమి పార్టిషన్‌కు సంబంధించి రూ.53వేలు లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీ అధికారులు కృష్ణాజిల్లా పెడన సబ్‌రిజిస్ట్రార్ బి జగన్‌ను వల వేసి పట్టుకున్నారు.

04/25/2018 - 02:50

విస్సన్నపేట, ఏప్రిల్ 24: మద్యం మత్తులో తమ బంధువైన కడవకొల్లు శివకేశవులు (36) అనే వ్యక్తిని తల్లిబోయిన నాగరాజు హత్య చేసిన సంఘటన సోమవారం రాత్రి నర్సాపురం గ్రామసమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నర్సాపురం గ్రామానికి చెందిన తల్లిబోయిన నాగరాజు అతని స్నేహితుడైన కలవకొల్లు శివకేశవులు మద్యం సేవించేందుకు తమ గ్రామ సమీపంలోని ఎన్‌ఎస్‌పీ కాలువ వద్దకు సోమవారం రాత్రి వెళ్ళారు.

04/25/2018 - 02:42

కర్నూలు ఓల్డ్‌సిటీ, ఏప్రిల్ 24: కర్నూలు నగర పాలక సంస్థలో పని చేస్తున్న బిల్లు కలెక్టర్ ఎస్.సుధాకర్ కొళాయి కనెక్షన్ కోసం రూ.5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి... కల్లూరులోని సాయి విద్యానికేతన్ ఇంగ్లీషు మీడియం స్కూల్ యజమాని నాగలక్ష్మిదేవి కొళాయి కనెక్షన్ కోసం కల్లూరు ఏరియాకు చెందిన మున్సిపల్ బిల్లు కలెక్టర్ ఎస్.సుధాకర్‌ను కలిసింది.

04/24/2018 - 23:38

వీరఘట్టం, ఏప్రిల్ 24: మండలంలోని పనసనందివాడ గ్రామంలో మంగళవారం పిడుగుపడి పాలకొండలోని నెయ్యిలవీధికి చెందిన పులిపుట్టి దుర్గారావు (45) అనే వ్యక్తి మృతి చెందారు. గ్రామంలోని వివాహ శుభకార్యానికి వంట చేసేందుకు వచ్చిన దుర్గారావు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భారీ వర్షం కురవడంతో సర్పంచ్ కొరికాన సన్యాసినాయుడుతో పాటు పలువురితో కలిసి గ్రామ సమీపంలోని పాఠశాల భవనంలోకి వెళ్లారు.

Pages