S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

05/14/2017 - 21:53

దూరం
బహుప్రమాదకరమైంది.
నువ్వొకటి తలిస్తే
వాళ్ళకు మరోటి అందుతుంది.
ఇక్కడ పూచిన పువ్వు
మన ఊరిలో
మరోలా పరిమళిస్తుంది.

05/14/2017 - 21:51

నేడు వివిధ భాషాచషకాల్లోంచి గజల్ మధుధారలు ప్రపంచ సాహితీ సంగీత ప్రియుల గొంతుల్ని తడపడమే కాదు, గుండెల్లి ‘తడి’ చేస్తున్న విషయం సాహిత్యాభిమానులకు కొత్తగా చెప్పనవసరం లేదు. సాహితీ ప్రక్రియ ఎంత పాతదైనా భావం గుప్పుమన్నప్పుడు హృదయ లయలో చప్పున క్రియా యోగ సంయోగం జరుగుతుందనడంలో సందేహమవసరం లేదు.

05/14/2017 - 21:50

ఎనె్నన్నో ఊహలు
ఎనె్నన్నో కలలు
తృప్తిపడని కోరికలు
పుట్టుకొచ్చే కోటి ఆశలు
ప్రయత్న లోపం
కలగా మిగిలిన ఫలం

నుదుటి రాతలు
అరచేతి గీతలు
రాశిఫలాల్లో దాగిన జాతకాలు
రాజపూజ్యం - అవమానాల బేరీజు
ఓ వైపు తృప్తి, మరోవైపు లేదు

05/14/2017 - 21:48

మూడు కాళ్ల మేక
నవరసభరిత కథా సంపుటి
రచన: కల్లూరు రాఘవేంద్రరావు
ప్రచురణ:
శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల,
హిందూపురం- 515201
పేజీలు: 152, ధర: రు.70/-
**

05/14/2017 - 21:47

మట్టిని నమ్ముకుని
కాసింత బతుకుని
మిరప నారుగా వుడుసుకొని
రైతు మనసు రెపరెపలాడుతుంది.

పంటంటే
అప్పటిలా కాదు
ఎటుచూసినా మదుపులే.

నీరు కడుతున్నపుడు
గాబు ఎగురుతున్నపుడు
మందులు పులుముతున్నపుడు
మిరపకాయలు కోస్తున్నపుడు
ఇంకా ఆఖరికి గుడారంకి చేర్చే దాకా
అన్నీ ఖర్చులే.

05/14/2017 - 21:45

సాహిత్య రంగంలో కలం పెట్టినవాళ్ళకి లేదా కలం పెడుతున్నవాళ్ళకి సాహిత్యంలో ప్రాథమిక పరిజ్ఞానం ఉండటం కనీసమైన యోగ్యత. ఏ రంగంలో రాణించాలన్నా ఆ రంగంలో కొంత పరిజ్ఞానం అవసరం కాబట్టి దానిని పెంపొందించుకుంటారు. అవగాహన చేసుకుంటారు. కానీ మన రచయితలు, కవులు.. ముఖ్యంగా నేటి తరంవాళ్ళకి ఇవేమీ పట్టవు. ఒక పుస్తకం, ఒక ప్రశంసాపూర్వకమైన ముందుమాట, తన వారిచే సమీక్ష.. ఇంకేముంది? ‘ప్రముఖ’ అనే పదాన్ని తగిలించుకోవచ్చు.

04/30/2017 - 22:46

ఎనిమిది గంటల పనిదినం ఎలాంటిదో ఎరగను నేను
ఉదయం పదవుతూనే పనిలో ప్రవేశిస్తాను
మీరు రాగానే చిరునవ్వుల తివాచీ పరుస్తాను
ఆప్యాయపు టత్తరు చల్లుతాను
ప్రతి అవసరానికి దిక్సూచినవుతాను
ఉదయం మధ్యాహ్నవౌతుంది
సాయంకాలవౌతుంది... రాత్రవుతుంది...
మధ్యలో రెండుసార్లు షావుకారు ఉదారంగా పంచే తేనీరు
ఇంటినుంచి వస్తున్నప్పుడే తెచ్చుకున్న చల్లారిన మెతుకులే

04/30/2017 - 22:45

సాహిత్యమంటే వెలుగు... సాహిత్యమంటే గలగల పారే వాగు. మిలమిల మెరిసే నక్షత్రం. జలజల కురిసె వర్షం. ఒక కెరటం ఒక మెరుపు ఒక ఉరుము. సాహిత్యం నిశ్శబ్దంకాదు. నిశ్శబాదన్ని సృష్టించే అక్షరాలు సాహిత్యం కాదు. సాహిత్యమంటే శబ్దం. ధిక్కరణ, చైతన్యం, పోరాటం... నిరంతర ప్రయాణం... ఆరని మంట...

04/30/2017 - 22:44

మనవాళ్ళు కవిత్వానికి పైత్యానికి సంబంధం ఉందంటారు. పైత్యానికి మందంటూ ఉంది ట. కాని కవిత్వానికి అది లేదట! ఇంగ్లీషు వాళ్ళు కవులను పిచ్చివాళ్ళను ఒక కుండలి (బ్రాకెట్)లో పడేసి గొళ్ళెం పెట్టి తాళం బిగించేరు. నయమే వారు కథలను స్వేచ్ఛగా వదిలేసారు! ‘ఏమి తిని సెపితివి కవితము’ అని తెనాలి రామకృష్ణుడు ప్రశ్న వేసినప్పటి నుంచి కవిత్వం భ్రష్టు పట్టింది అన్న అనుమానం రావడం సహజమే!

04/30/2017 - 22:43

తొందరపడొద్దు
నాటిన విత్తు మట్టితో మాట్లాడింది
తడితో సావాసం చేసింది
గాలిని ఆహ్వానించింది
విత్తు మొలకెత్తుతుంది
ఎటొచ్చీ, అరచేయి అడ్డేస్తావో
గెనంపై కూర్చొని సంరక్షణ చేస్తావో
మంచె పైకెక్కి కాపలా కాస్తావో-

Pages