S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

03/23/2020 - 01:49

రోమ్, మార్చి 22: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత మరింత జఠిలంగా మారుతోంది. దాదాపు 100 కోట్ల మంది ఇళ్లకే పరిమితమైపోయే పరిస్థితి తలెత్తింది. ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 13,444కు పెరిగింది. దాదాపు 170 దేశాల్లో ఈ వ్యాధి తీవ్రత పెరుగుతోంది. దాదాపు 35 దేశాలు లాక్ డౌన్ పరిస్థితిలోకి వెళ్లిపోయాయి.

03/23/2020 - 06:46

వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన్ని సకాలంలో ప్రపంచ దేశాలతో పంచుకోలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ఒకవేళ చైనా కరోనా వైరస్ గురించి ముందే హెచ్చరించి ఉంటే, అమెరికా, ప్రపంచం ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇంకా బాగా సిద్ధమయి ఉండేవని ఆయన పేర్కొన్నారు.

03/19/2020 - 05:58

వాషింగ్టన్: కరోనా వైరస్ భయంతో అమెరికా వణికిపోతున్నది. విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్యను పరిమితం చేసే దిశగా చర్యలు చేపట్టింది. అదేవిధంగా వివిధ కార్యక్రమాలనూ రద్దు చేసుకుంది. అందులో భాగంగానే స్పెయిన్ రాజు ఫెలిప్-6, రాణి లెటిజియా పర్యటనకు బ్రేక్ వేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన భార్య మెలానియా ట్రంప్‌తో స్పెయిన్ రాజు, రాణి వచ్చే నెల 21వ తేదీన సమావేశం కావాల్సి ఉంది.

03/19/2020 - 05:46

కరోనా వైరస్ దెబ్బకు కరచాలనాలు, ఆలింగనాలు పోయి నమస్తే పెట్టడం అలవాటవుతోంది. విదేశాల్లోనూ ‘నమస్తే’ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. జకార్తాలో నెదర్లాండ్స్ రాజు విలియమ్ అలెగ్జాండర్, ఇండోనేషియా విదేశాంగ మంత్రి రెంటో మర్సూదీ ఒకరినొకరు ‘నమస్తే’తో పలకరించుకున్నారు

03/16/2020 - 05:27

బార్సిలోనా, మార్చి 15: ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయలేక ప్రపంచ దేశాలు కకావికలవుతున్నాయి. దాదాపు అన్ని దేశాలను కమ్ముకుని ఈ వైరస్ ఇప్పటివరకు దాదాపు 6వేల మందిని బలిగొంది. ప్రపంచవ్యాప్తంగా 1.50 లక్షలకు పైగా ఈ ప్రాణాంతక వ్యాధి సోకి అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ధనిక, పేద అన్న తేడా లేకుండా అన్ని దేశాలు ఈ వైరస్‌పై అహరహం పోరాడుతున్నాయి.

03/16/2020 - 06:34

హరారే: ‘అమెరికా, యూరప్ దేశాలకు కరోనా వైరస్ భగవంతుడు విధించిన శిక్ష’ అని జింబాబ్వే రక్షణ మంత్రి ఒప్పా ముచింగురి నిప్పులు చెరిగారు. తమ దేశంలోని మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినందుకు, పాలక పాలనలోని సభ్యులపై ఆంక్షలు విధించినందుకు కరోనా మహామ్మారిని అమెరికా, యూరప్ దేశాలకు భగవంతుడు శిక్షగా విధించారని ఆయన ఆదివారం పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను వణికిస్తోంది.

03/16/2020 - 05:10

వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా మహమ్మారి ముదిరిపోవడంతో అమెరికా ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. 46 రాష్ట్రాలకు విస్తరించిన ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ ఎమర్జన్సీ ప్రకటించారు. ఇప్పటికే అమెరికాలో 40 మందిని ఈ వైరస్ బలిగొంది. దేశవ్యాప్తంగా 2వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ‘పరిస్థితి మరింతగా క్షీణించే ప్రభావం కనిపిస్తోంది.

03/16/2020 - 05:09

వాషింగ్టన్, మార్చి 14: తాను కరోనా వైరస్ పరీక్షలు చేయించుకునే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఇంతవరకు తనకు ఈ వైరస్ లక్షణాలేవీ లేవని వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. ఇటీవల ఈ వైరస్ సోకిన బ్రెజిల్ అధికారిని ట్రంప్ కలుసుకున్న నేపథ్యంలో వైద్య పరీక్షల అంశం తెరపైకి వచ్చింది.

03/16/2020 - 05:07

రోమ్, మార్చి 14: శనివారం వచ్చిందంటే ఇటలీ జనమంతా వీధుల్లోనే. వారాంతపు ఆనందోత్సాహాలను అంతగా అక్కడి ప్రజలు జరుపుకుంటారు. కానీ ప్రాణాంతక కరోనా వైరస్ ఇటలీని ఇంటికే పరిమితం చేసింది. ఖాళీ రోడ్లు, మూసేసిన దుకాణాలు, భయానక నిర్మానుష్యం, నిశ్శబ్దం ఈ వారాంతంలో ఇటలీని అలుముకున్నాయి. దేశంలో ఈ వైరస్ వ్యాప్తి అత్యంత తీవ్రంగా ఉండడంతో ఇటలీ ప్రభుత్వం తీవ్ర చర్యలను చేపట్టింది.

03/16/2020 - 05:04

మాడ్రిడ్: కరోనా వైరస్ గుప్పిట చిక్కిన స్పెయిన్‌లో కేవలం 24 గంటల్లోనే 1,500కు పైగా కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ కేసుల మొత్తం సంఖ్య 5,763కు పెరిగింది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైన నిధుల సమీకరణలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఇప్పటికే ఈ వైరస్ వల్ల 136 మంది మరణించడంతో దేశ ప్రధాని ఫెడ్రో శాంచెజ్ జాతినుద్దేశించి ప్రకటించే అవకాశం ఉంది.

Pages