S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్ర

02/23/2017 - 01:17

బాలీవుడ్ తొలి స్టంట్ విమెన్ మేరి ఇవాన్స్ కథానాయిక ప్రాధాన్య చిత్రాలకు ఆద్యురాలు
‘్ఫయర్‌లెస్ నదియా’గా పేరుప్రఖ్యాతలు ఆమె జీవితకథ నేపథ్యంతో ‘రంగూన్’?
కోర్టు వివాదం నడుమ రేపు విడుదల

02/23/2017 - 01:15

ప్రఖ్యాత దర్శకుడు విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో రూపొందిన డ్రామా పీరియాడికల్ చిత్రం. రొమాంటిక్ సన్నివేశాలుంటాయి. రెండో ప్రపంచయుద్ధ నేపథ్యంలో సినిమా కొనసాగుతుంది. సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జమాందార్ నవాబ్ మాలిక్‌గా షాహిద్‌కపూర్, రుస్తుం ‘రుషి’ బిల్లిమొరియాగా సైఫ్ అలీఖాన్, మిస్ జూలియాగా కంగనారనౌత్ నటిస్తున్నారు. జపాన్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ నటీనటులకు ఇందులో అవకాశం ఇచ్చారు.

02/23/2017 - 01:13

నాని కథానాయకుడిగా డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శివ దర్శకత్వంలో దానయ్య డి.వి.వి. రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ రేపు విడుదల కానుంది. హీరో జన్మదినోత్సవం సందర్భంగా 24న ఫస్ట్‌లుక్‌తోపాటుగా సినిమా పేరును ప్రకటించనున్నారు.

02/23/2017 - 01:12

దర్శకుడు వెంకటేష్ రూపొందించిన చిత్రం ‘ఇప్పట్లో రాముడిలా, సీతలా ఎవరుంటారండీ బాబూ..’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు స్పైసీగా వుండడంతో వెబ్‌సైట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత ప్రశ్నార్థ్ తాత మాట్లాడుతూ- దర్శకుడు వెంకటేష్ తాను ఏం చెప్పదలచుకున్నాడో అదే తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడని, లాభనష్టాల సంగతి పక్కనపెట్టి, యువతకు గిలిగింతలు పెట్టేలా చిత్రాన్ని రూపొందించారని తెలిపారు.

02/23/2017 - 01:11

వెనె్నల క్రియేషన్స్ పతాకంపై కుమార్ వట్టి దర్శకత్వంలో బలగ ప్రకాశ్‌రావు రూపొందిస్తున్న చిత్రం మా అబ్బాయి. శ్రీవిష్ణు, చిత్రా శుక్లా జంటగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను సురేష్ బొబ్బిలి అందించగా, ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.

02/23/2017 - 01:10

మలయాళం, తమిళ భాషల్లో 20 చిత్రాలకు పైగా హీరోయిన్‌గా నటించి అనతికాలంలోనే మంచి పెర్ఫార్మర్‌గా పేరుతెచ్చుకున్న మియాజార్జ్ ప్రస్తుతం విజయ్ ఆంటోని హీరోగా జీవశంకర్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి రూపొందిస్తున్న ‘యమన్’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.

02/23/2017 - 01:07

తెలుగు, తమిళ భాషల్లో గ్లామర్ స్టార్‌గా ఎదిగిన అమలాపాల్ దర్శకుడు విజయ్‌ని వివాహమాడిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో విడాకులను మంజూరు చేసింది. గత ఆరునెలలుగా విడివిడిగా వుంటున్నారు. 2014 జూన్ 12న పెద్దలు కుదిర్చిన ఈ పెళ్లితో అమలాపాల్ ఇన్నాళ్లూ సినిమాలకు దూరంగా వుంది.

02/23/2017 - 01:06

రూపేశ్ శెట్టి, రమ్య జంటగా కన్నడంలో రూపొందించిన చిత్రాన్ని తెలుగులో స్వర్ణ్భారతి క్రియేషన్స్ పతాకంపై నిర్మాత సాయి వెంకట్ తెలుగులో అందిస్తున్నారు. దేవరాజ్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి.

02/23/2017 - 01:06

ఈమధ్యే పలు వివాదాల్లో చిక్కుకున్న శే్వతబసు ప్రసాద్ ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా వుంది. రెండు చిత్రాలకు స్క్రిప్ట్ ఎనలిస్ట్‌గా పనిచేస్తూనే మరోవైపు ఓ డాక్యుమెంటరీ రూపొందిస్తోంది. నాలుగేళ్లుగా మ్యూజిక్‌పై రూపొందించిన ఈ డాక్యుమెంటరీతో సంచలనం రేపడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో పెద్దగా సినిమా అవకాశాల్లేని ఈమె, ఈ ప్రాజెక్టును చేపట్టింది.

02/23/2017 - 01:04

సాయిధరమ్‌తేజ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘విన్నర్’. ఈ చిత్రం ఈనెల 24న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు మాట్లాడుతూ- వెనె్నల కిశోర్ ఈ చిత్రంలో పద్మగా ప్రేక్షకుల గుండెలను గెలుచుకుంటాడని, హిలేరియస్ కామెడీతో తనదైన ముద్రతో కడుపుబ్బ నవ్విస్తాడని తెలిపారు.

Pages