జాతీయ వార్తలు

లోకసభలో తలాక్ బిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అందరూ ఎదురుచూస్తున్న ముమ్మార్ తలాక్ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోకసభ ముంగిటకు తీసుకువచ్చింది. న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఈ బిల్లును లోకసభలో ప్రవేశపెట్టగానే కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకుస్తున్నట్లు ప్రకటించారు. తలాక్ చెప్పే పద్ధతికి తాను వ్యితిరేకినని, అదే సందర్భంలో దీనిని క్రిమినల్ చర్యగా పరిగణించటాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. దీంతో కాంగ్రెస్ ఎంపీలు అంతా తలాక్ బిల్లుపై నిరసన వ్యక్తం చేశారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ సైతం ఈ బిల్లుకు అభ్యంతరం చెప్పారు. ముస్లిం మహిళల పట్ల చూపుతున్న ఆదరణ శబరిమల హిందువు మహిళల పట్ల ఎందుకు చూపటం లేదని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14,15ను ఇది అతిక్రమిస్తుందని అన్నారు. దీంతో లోకసభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ రవి శంకర్ ప్రసాద్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.