జాతీయ వార్తలు

111 మందితో బిజెపి జాతీయ కార్యవర్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 12: బిజెపి అధ్యక్షుడు అమిత్ షా గురువారం ప్రకటించిన పార్టీ జాతీయ కార్యవర్గంలో పార్టీ మహిళా నేతలు స్మృతి ఇరానీ, హేమమాలిని, నజ్మాహెఫ్తుల్లాలకు స్థానం లభించలేదు. కాగా, కీలక రాష్ట్రాలయిన పశ్చిమ బెంగాల్, బీహార్‌లలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యూహాన్ని ఖరారు చేయడానికి జరిగే జాతీయ కార్యవర్గ కీలక సమావేశం వచ్చే నెల బెంగళూరులో జరుగుతుంది. అమిత్ షా 111 మంది సభ్యుల పార్టీ జాతీయ కార్యవర్గాన్ని ఖరారు చేసారు. ఈ కార్యవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని ఎబి వాజపేయితో పాటు పలువురు అగ్రనేతలకు స్థానం లభించింది. ఎనిమిది బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పిడిపితో కలిసి పార్టీ అధికారం పంచుకున్న జమ్మూ, కాశ్మీర్ ఉపముఖ్యమంత్రితో సహా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులకు కూడా జాతీయ కార్యవర్గంలో స్థానం లభించింది. వీరే కాకుండా 24 మంది మాజీ ముఖ్యమంత్రులు, ముగ్గురు మాజీ ఉపముఖ్యమంత్రులు జాతీయ కార్యవర్గంలో శాశ్వత ఆహ్వానితులుగా ఉన్నారు. త్వరలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుండడంతో పాటు అమిత్ షా పార్టీని పునర్వ్యవస్థీకరించనున్న నేపథ్యంలో కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించడం గమనార్హం. జాతీయ కార్యవర్గంలో చోటు లభించిన వారిలో పార్టీ సీనియర్ నాయకులు ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, ఎం వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ, అనంత్ కుమార్, తవర్‌చంద్ గెహ్లాట్, జెపి నడ్డా, రవిశంకర్ ప్రసాద్, కల్‌రాజ్ మిశ్రా, నరేంద్ర సింగ్ తోమార్, హర్షవర్ధన్, బండారు దత్తాత్రేయ, రాధా మోహన్ సింగ్‌లున్నారు. వీరితో పాటుగా యశ్వంత్ సిన్హా, వినయ్ కతియార్, సిపి ఠాకూర్, విజయ్ కుమార్ మల్హోత్రా లాంటి పలువురు సీనియర్ నాయకులు, యువ కేంద్ర మంత్రులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ధర్మేంద్ర ప్రధాన్, రాజీవ్ ప్రతాప్ రూడీ, సురేశ్ ప్రభు, నిర్మలా సీతారామన్‌లాంటి వారికి కూడా జాతీయ కార్యవర్గంలో చోటు దక్కింది. యోగి ఆదిత్యనాథ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూలాంటి పార్టీ ఫైర్‌బ్రాండ్‌లకు జాతీయ కార్యకవర్గంలో చోటు లభించగా, అలాంటి ముద్రే ఉన్న సాధ్వీ నిరంజన్ జ్యోతికి ప్రత్యేక ఆహ్వానితురాలిగా స్థానం కల్పించారు. వీరిలో పాటు అన్ని రాష్ట్రాల శాసన సభలు, శాసన మండలులో పార్టీ నేతలు, అన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు జాతీయ కార్యవర్గంలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు.