హైదరాబాద్

ఆబిడ్స్‌లో ఆకస్మిక తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: బల్దియా బాసు ఆకస్మిక తనిఖీలు చేపట్టి సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టించారు. శుక్రవారం ఆబిడ్స్ మున్సిపల్ ఆఫీసులో తనిఖీలు నిర్వహించిన కమిషనర్ జనార్దన్‌రెడ్డి సర్కిల్ 9ఏ, 9బి లోని సూపర్‌వైజరీ ఆఫీసర్, అసిస్టెంటు మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్, అసిస్టెంటు సిటీ ప్లానర్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించి, రికార్డులను తీరిగ్గా పరిశీలించారు. రికార్డులను ఇదే తరహాలో సక్రమంగా మెయిన్‌టైన్ చేయాలని సూచిస్తూ తనిఖీలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ముఖ్యంగా సిబ్బంది ఈ ఆర్థిక సంవత్సరం దగ్గర పడుతుండటంతో ఆస్తిపన్ను వసూళ్లపై దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా ఆస్తిపన్నుకు సంబంధించిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించి, బకాయిదారుడు వీలైనంత త్వరగా పన్ను చెల్లించే విధంగా వారికి సహకరించాలని కమిషనర్ సూచించారు. అంతేగాక, చాలా కాలంగా పెద్ద మొత్తంలో బకాయి పడ్డ కమర్షియల్ సంస్థలను గుర్తించి, పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. దీంతో పాటు సినిమా ధియేటర్ల నుంచి వినోదపు పన్నును కూడా వసూలు చేయాలని సూచించారు. ఇప్పటి వరకు పలు దఫాలుగా నోటీసులు జారీ చేసినా, పన్ను చెల్లించని బకాయిదారులను గుర్తించి రెడ్ నోటీసులు జారీ చేయాలని సూచించారు. అంతకు ముందు ప్రతి సర్కిల్‌లోని ట్యాక్సు సిబ్బంది తమ పరిధుల్లోని బకాయిదారుడి సెల్‌ఫోన్‌కు రోజుకోసారి పన్ను చెల్లించాలని కోరుతూ ఎస్‌ఎంఎస్ పంపాలని సూచించారు. లక్షల, కోట్లలో చాలా కాలంగా చెల్లించని మొండి బకాయిలను గుర్తించి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువస్తే, అవి వసూలు చేసేందుకు అందరం కలిసి సమష్టిగా కృషి చేద్దామని ఆయన సిబ్బందికి వివరించారు. దీంతో పాటు ఇప్పటి వరకు స్వీకరించిన బిల్డింగ్ పినలైజేషన్ స్కీం, లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీంకు సంబంధించి దరఖాస్తులకు క్షేత్ర స్థాయి పరిశీలన జరపాలని సూచించారు. అలాగే నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు గాను కొత్తగా ప్రవేశపెట్టనున్న రెండున్నర వేల ఆటో టిప్పర్ల విషయంలో అసిస్టెంటు మెడికల్ ఆఫీసర్లు అర్హులైన లబ్దిదారులనే ఎంపిక చేయాలని ఆయన సూచించారు.
21 నుంచి ‘పరిష్కారం’ కార్యక్రమాలు
ఆస్తిపన్ను బకాయిలకు సంబంధించి బకాయిదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు, సంబంధిత ఫిర్యాదులను పరిష్కరించేందుకు గాను ఈ నెల 21వ తేదీ ఆదివారం నుంచి ఆరు ఆదివారాల పాటు అన్ని సర్కిళ్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి ఒంటి గంట మధ్య ‘ప్రాపర్టీ ట్యాక్సు పరిష్కారం’ కార్యక్రమాలను నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు.