హైదరాబాద్

ఆ పోలీసు అధికారిని సస్పెండ్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకుని అర్ధాంతరంగా తనువు చాలించిన రోహిత వేముల సూసైడ్ నోట్‌ను వక్రీకరించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటరమణి, నాగురావు నామాజీలు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకోవటం పట్ల తాము చింతిస్తున్నామని, బాధిత కుటుంబానికి బిజెపి పార్టీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోందని వారు పేర్కొన్నారు. కానీ రోహిత్ సూసైడ్ నోట్‌లో లేని అంశాలను, పేర్లను కొంత మంది ప్రస్తావించటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. చనిపోయిన రోహిత్ కుటుంబ సభ్యులు గానీ, బంధువులు గానీ ఎవరికీ సంబంధం లేకుండా కొంతమంది బయటి వ్యక్తులు తమ ఉనికి కాపాడుకునేందుకే ఇలాంటి అంశాలను, పేర్లను ప్రస్తావిస్తున్నారని వారు మండిపడ్డారు. ఇప్పటి వరకు మచ్చలేని నాయకుడిగా పేరుగాంచిన కేంద్ర మంత్రి, ఓ పేరుగాంచిన న్యాయవాది, ఎమ్మెల్సీలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయటం తగదని వారు వ్యాఖ్యానించారు.
ఇది రాజకీయ కుట్రలో భాగమేనని, రోహిత్ తన సూసైడ్‌నోట్‌లో రాసిన వాస్తవాలను కప్పిపుచ్చడం కూడా నేరమేనని వారు వ్యాఖ్యానించారు. తన చావుకు ఎవరూ కారకులు కాదు. తాను చనిపోవడానికి, శత్రువులకు గానీ, మిత్రులకు గానీ సంబంధం లేదని స్పష్టంగా రాసినా కొంతమంది అనవసర రాద్ధాంతం చేస్తూ, రోహిత్ ఆత్మహత్యతో రాజకీయాలు చేయటం ముమ్మాటికి శవ రాజకీయమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అజాత శత్రువుగా, మచ్చలేని నేతగా, తెలంగాణలో ఓ బడుగు బలహీనవర్గానికి చెందిన బిసి నేత బండారు దత్తాత్రేయను టార్గెట్ చేసుకుని అవాస్తవమైన ప్రచారం చేయటం రాజకీయ దివాళకోరుతనమేనని వ్యాఖ్యానించారు. పైగా రోహిత్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకుని చనిపోతే కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఇంటి ముట్టడికి తెలంగాణ జాగృతి కార్యకర్తలు రావటంలో ఆంతర్యమేమిటి? అని ప్రశ్నించారు. తెలంగాణ అంటే కేవలం కెసిఆర్, కెటిఆర్, హరీశ్‌రావు, కవితల జాగీరా? వారి దర్బార్‌లో బిసి నేతలు ఎవరు ఎదగవద్దా? అని ప్రశ్నించారు. గడీల పాలన సాగించే కెసిఆర్, కవిత ఓ బిసి నేతలను టార్గెట్ చేసుకుని రాద్దాంతం చేయడంపై కెసిఆర్ కుటుంబం దొరతనానికి నిదర్శనంగా పేర్కొన్నారు. రోహిత్ ఆత్మహత్య ఘటనమై న్యాయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ సమగ్రంగా ఆలోచించి, నిజా నిజాలు తేల్చి ముందుకెళ్లాల్సిన అవసరముందని వెంకటరమణి వ్యాఖ్యానించారు. అసలు పోలీసు అధికారులు తప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయటం వల్లే ఈ రాద్ధాంతం జరుగుతోందని, సదరు పోలీసు అధికారిని సస్పెండ్ చేయాలని వెంకటరమణి, నాగురావు నామాజీ డిమాండ్ చేశారు.