జాతీయ వార్తలు

అరుణాచల్‌లో రాష్టప్రతి పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ ఇటానగర్, జనవరి 24: గత నెల రోజులుగా రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన విధించాలని కేంద్ర మంత్రివర్గం ఆదివారం సిఫార్సు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అప్పటికప్పుడు జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచాలని కూడా కేబినెట్ నిర్ణయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్టప్రతి పాలన విధించాలన్న నిర్ణయాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ప్రతిఘటించింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంగా అభివర్ణించింది. రాష్ట్ర సిఎం నబం తుకి కూడా ఈ పరిణామం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర నిర్ణయం తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. చైనాకు సరిహద్దులో ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌ను రాజకీయంగా అస్తవ్యస్తం చేయాలన్న లక్ష్యంతో మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని తాము కోర్టులో సవాలు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏదీ లేదని, ఇందుకు సంబంధించి గవర్నర్ ఇచ్చిన నివేదికలో నిజం లేదన్నారు. ఒకవేళ సంక్షోభం ఏదైనా ఉంటే అది గవర్నర్ సృష్టేనని ఆరోపించారు. తనకు కేబినెట్ మద్దతు పూర్తిస్థాయిలో ఉందన్నారు. అధికార పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష బిజెపితో కలిసి అసెంబ్లీ స్పీకర్ నబం రెబియాను అభిశంసించడం, అలాగే సిఎంని కూడా తొలగించి మరో వ్యక్తిని ఎన్నుకోవడంతో సంక్షోభం తలెత్తింది. దీనిపై రాష్టప్రతికి, ప్రధానికి కూడా సిఎం లేఖలు రాశారు. ఈ వ్యవహారం అంతిమంగా సుప్రీంకోర్టు పరిశీలనకు వెళ్లడంతో రాజ్యాంగ బెంచ్‌కు నివేదించారు. ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌కూడా అరుణాచల్ ప్రదేశ్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీన్ని భారత రాజ్యాంగాన్ని ఖూనీ చేయడంగా అభివర్ణించారు. ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీస పక్షంగా సంప్రదించకపోవడం విస్మయకరమన్నారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఉన్నా కూడా శాంతిభద్రతల పరంగా ఎలాంటి సమస్య తలెత్తలేదని, అలాంటప్పుడు ఏ కారణంతో రాష్టప్రతి పాలన విధిస్తారని ప్రశ్నించారు.