జాతీయ వార్తలు

అరుణాచల్‌లో రాష్టప్రతి పాలనపై కాంగ్రెస్ పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన విధించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ‘సుప్రీం కోర్టు రిజిస్ట్రీలో సోమవారం మేం పిటిషన్ దాఖలు చేశాం’ అని కాంగ్రెస్ నేత, సీనియర్ అడ్వొకేట్ వివేక్ టంఖా వెల్లడించారు. అరుణాచల్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ విప్ బమాంగ్ ఫెలిక్స్ పిటిషన్ వేశారన్నారు. పిటిషన్‌ను అత్యవసరమైనదిగా పరిగణించి విచారించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరినట్టు వివేక్ చెప్పారు. కోర్టు నిర్ణయంకోసం వేచిస్తున్నట్టు మరో న్యాయవాది తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన విధిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ సవాల్ చేసింది. అరుణాచల్‌లో రాష్టప్రతి పాలన విధించాలన్న కేంద్ర నిర్ణయాన్ని అడ్డుకోవాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి ఆదివారం కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది.