హైదరాబాద్

అలరించిన రెహనా నృత్య విన్యాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: శ్రీ సత్య కళానికేతన్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నటరాజ కళామందిరంలో డా. రెహనా భార్గవ్ అద్భుతమైన నృత్య విన్యాసంతో శుక్రవారం మధ్యాహ్నం ప్రేక్షకులను ఆకట్టుకుంది. వైద్య వృత్తిలో వున్న తాను నృత్యంపై అభిమానంతో అనేక మెళకువలు నేర్చుకుని సహ నృత్య కళాకారుడు భార్గవ్‌ను వివాహం చేసుకుని దేశం నలుమూలలా సుమారు ఐదు వందలకుపైగా ప్రదర్శనలిచ్చామని ఆమె తెలిపారు. పుష్పాంజలి అంశంతో నృత్యం ప్రారంభించి ఆధ్యాత్మిక రామాయణ శబ్దం అంశాన్ని సుమారు అరవై నిమిషాలు చక్కని అభినయంతో ప్రదర్శించింది. తిల్లాన, శివాష్టకం అంశాలను ప్రదర్శించిన తరువాత ‘పలుకు తేనెల తల్లి..’ అన్నమాచార్య కీర్తనను రమ్యంగా ప్రదర్శించి ప్రేక్షకుల హర్షధ్వానాలు అందుకుంది. భార్గవ్ నట్టువాంగానికి, లీలామనోహర్ గానానికి అనువుగా రెహనా కడు రమ్యంగా నర్తించింది.