జాతీయ వార్తలు

ఆప్ ఎమ్మెల్యే అల్కా లాంబాపై సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నోరు జారినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అల్కా లాంబాపై అధిష్ఠానం సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ అధికార ప్రతినిధి నుంచి రెండు నెలల పాటు ఆమెను తప్పిస్తూ సస్పెన్షన్ వేటు వేశారు. దిల్లీ రవాణా మంత్రి గోపాల్‌రాయ్ రాజీనామా విషయమై ఆమె అత్యుత్సాహంగా మాట్లాడడం అధిష్ఠానానికి ఆగ్రహం తెప్పించింది. అవినీతి ఆరోపణలు వచ్చినందునే గోపాల్‌రాయ్ మంత్రి పదవి నుంచి తప్పుకున్నారంటూ అల్కా నోరు జారారు. అవినీతి ఆరోపణలు వాస్తవమే అయినప్పటికీ గోపాల్‌రాయ్ రాజీనామా గురించి మీడియాకు ఆమె వివరాలు చెప్పడాన్ని క్రమశిక్షణా రాహిత్యంగా ఆప్ అధిష్ఠానం పరిగణించింది. ఆమె చేసిన ప్రకటన దిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఇబ్బందికరంగా మారింది.