అదిలాబాద్

జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూన్ 9: స్వచ్ఛ భారత్ మిషన్ పథకం ద్వారా బహిరంగ మలవిసర్జన సహిత ఆదిలాబాద్ జిల్లాగా రూపొందించడానికి కృషి చేయాలని జిల్లా గ్రామీణ తాగునీటి శాఖ ఎస్‌ఈ మల్లేష్‌గౌడ్ అన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మరుగుదొడ్ల నిర్మాణం పనులు వేగవంతంగా నిర్వహించి, సంపూర్ణ పారిశుద్ధ్య పంచాయతీలుగా తీర్చిదిద్దడానికి ఎంపిడీవోలకు, డ్వామా ఎపివోలకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్వచ్చ భారత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాబోవు నాలుగేళ్లలో రాష్టవ్య్రాప్తంగా సంపూర్ణ పారిశుద్ద్య గ్రామ పంచాయతీలుగా అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అదికారులకు వివరించారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు 2019 అక్టోబర్ 2 నాటికి దేశంలోని అన్ని పంచాయతీలు సంపూర్ణ పారిశుద్ధ్య పంచాయతీలుగా అభివృద్ధి చేయడానికి మండల అభివృద్ధి అధికారులు, డ్వామా ఏపివోలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్వచ్చ భారత్ మిషన్ పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం 5వ స్థానంలో ఉందని, జిల్లా 23.414 శాతం మాత్రమే ప్రగతి సాధించగల్గిందన్నారు. 2019 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని ఓడిఎఫ్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, 201617 సంవత్సరంలో 300 పంచాయతీలలో రెండవ పేజ్‌లో 42 పంచాయతీలను ఓడిఎఫ్‌గా గుర్తించడం జరిగిందన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ కన్సల్టెంట్ సుధాకర్ రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నాలుగేళ్లలో మరుగుదొడ్ల నిర్మాణాల ప్రగతిపై వివరించారు. ఆన్‌లైన్ పద్దతి ద్వారా దరఖాస్తుల స్వీకరణ, అప్‌డేషన్ విధానం గురించి ఈ సందర్భంగా అధికారులకు వివరించారు. సమావేశంలో జడ్పీ సిఈవో జితేందర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి పోచయ్య, మండల అభివృద్ధి అధికారులు, డ్వామా ఎపివోలు పాల్గొన్నారు.