అదిలాబాద్

గుడుంబా నియంత్రణకు అన్ని విధాల సహకరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూన్ 9: జిల్లాలో నిషేదిత గుడుంబా నియంత్రణకు సమష్టిగా కృషి జరగాలని, ఇందుకోసం పోలీసు శాఖ తరుపున అన్ని విధాలుగా సహకరిస్తామని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. గురువారం పోలీసు కార్యాలయంలో ఎస్పీ దుగ్గల్‌ను ఎక్సైజ్ శాఖ ఇంచార్జి డిప్యూటి కమిషనర్ ఎం.రమేష్ రాజ్ మర్యాదపూర్వకంగా కలుసుకొని పోలీసుల సహకారాన్ని కోరారు. ప్రభుత్వం నిషేదించిన దేశిదారు, గుడుంబాను అరికట్టేందుకు వ్యూహాత్మకంగా దాడులు నిర్వహించాలని, నిందితులను ముందుగానే గుర్తించడం ద్వారా వారిపై కేసులు నమోదు చేసే వీలుకల్గుతుందన్నారు. త్వరలోనే ఇరు శాఖల ద్వారా సమష్టిగా సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని ఎస్పీ వివరించారు.