అదిలాబాద్

రూపాయికే నల్లా కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, జూన్ 9: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం సంవత్సరానికి రూ.2లక్షల ఆదాయం కలిగి ఉన్నవారికి బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 23వార్డుల్లో గల పేద ప్రజలు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ పసుల సునీతారాణి కోరారు. గురువారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పట్టణంలోని కన్నాల బస్తీ, షంషీర్ నగర్, కాంట్రాక్టర్ బస్తీ, మదునన్న నగర్, అంబేద్కర్ నగర్, హనుమాన్ బస్తీ, బాబు క్యాంపు, రడగంబాల బస్తీ, బెల్లంపల్లి బస్తీ, స్టేషన్ రోడ్ కాలనీ, బూడిదగడ్డ బస్తీ, మహ్మద్ ఖాసీం బస్తీ, టేకుల బస్తీ, గంగరాంనగర్, గొల్లగూడెం, గోల్‌బంగ్లా బస్తీల్లో నల్లా కనెక్షన్‌లు లేనివారు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. నీటి కనెక్షన్ కోసం దరఖాస్తుతో పాటు ఆదార్ కార్డు, రూ.2లక్షల లోపు ఆదాయ దృవీకరణ పత్రం, ఇంటి పన్ను రశీదు కాపీలను జత చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఆర్‌వో మల్లారెడ్డి, ఏ ఈ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.