అదిలాబాద్

బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, జూన్ 9: బడీడు పిల్లలను వంద శాతం పాఠశాలల్లో చేరేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్ సంబంధిత ఏటిడబ్ల్యూవోలు, హెచ్‌ఎంలను ఆదేశించారు. గురువారం స్థానిక పిఎమ్మార్సీ భవనంలో ఏటిడబ్ల్యూవోలు, హెచ్‌ఎంలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సెస్సీలో 80శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని, వచ్చే ఏడాదిలో 95శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పదవ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులను పాఠశాలల్లోనే ఉంచి విద్యాబుద్దులు నేర్పుతు 15 నుండి జరిగే పరీక్షలకు సిద్దం చేయాలన్నారు. ఈనెల 13నుండి 18వరకు నిర్వహించే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో బడీడు పిల్లలను బడులో చేర్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలల్లో పిల్లలు ఆనారోగ్యం బారిన పడినవారి కోసం ప్రత్యేక విశ్రాంతి గది ఏర్పాటు చేయాలని అన్నారు. అనంతరం 143 ఆశ్రమ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో డిడి రాంమూర్తి, ఈఈ రమేష్, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.