అదిలాబాద్

ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్ రూరల్, జూన్ 9: అంగన్‌వాడీ కేంద్రాలు ఆరోగ్యలక్ష్మీ పథకాన్ని సమర్దవంతంగా నిర్వహిస్తూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని రాష్ట్ర స్ర్తి శిశుసంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ కే.ఆర్.ఎస్ లక్ష్మీదేవి అన్నారు. మండలంలోని వెంగ్వాపేటలో అంగన్‌వాడీ కేంద్రాలను గురువారం ఆకస్మికంగా సందర్శించారు. కేంద్రంలో ఆరోగ్యలక్ష్మీ పథకం అమలవుతున్న తీరును పరిశీలించారు. కార్యకర్తను సంబంధిత వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. నేరుగా గర్భిణిలను పథకం ద్వార పొందుతున్న ప్రయోజనాలను అడిగారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి మాట్లాడుతూ గర్భిణితో పాటు పుట్టబోయే శిశువు ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకోని ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తుందన్నారు. క్షేత్ర స్ధాయి అధికారులు ,సిబ్బంది ఆరోగ్యలక్ష్మీని పకడ్బందిగా అమలు చేయాలని సూచించారు.మెను అనుసరించి పౌష్టికరమైన ఆహారం అందించాలన్నారు. సన్నం బియ్యంతో ఆహారం అందించాలని గర్భిణిలు జేడిని కోరారు. వీరి వినతికి స్పందిస్తూ సన్నం బియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని అది త్వరలో అమలవుతుందని పేర్కోన్నారు. గ్రామంలో నడస్తున్న మూడు అంగన్ వాడీ కేంద్రాల సొంత భవనాలకుగాను స్ధలాన్ని కేటాయించిన గ్రామ సర్పంచి నాగభూషన్‌ను అభినందించారు. జేడి వెంట హైదరాబాద్ సిడిపివో నర్సింహ రెడ్డి, సిడిపివో వెంకటేశ్వరమ్మ, సూపరవైజర్లు రేవతి, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గోన్నారు.