అదిలాబాద్

పరిసరాలు పరిశుబ్రంగా ఉంచుకుంటే అంటువ్యాధులు దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, జూన్ 9: వర్షాకాలంలో ప్రబలే అంటువ్యాధులను అరికట్టేందుకు పరిసరాల పరిశుభ్రతంగా ఉండేలా చూసుకోవాలని జిల్లా మలేరియా అధికారి అల్హం రవి పేర్కొన్నారు. గురువారం ఆసిఫాబాద్ క్లస్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అడ, కెరమెరి, వాంకిడి, రెబ్బెన పిహెచ్‌సిన పర్యవేక్షక సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. వర్షాకాలంలో ప్రతి ఒక్కరు స్థానికంగా ఉండాలని సూచించారు. వ్యాధులకు కారణమైన దోమలను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఇండ్ల చుట్టు మురికి గుంతలు ఉండకుండా, వర్షపునీరు నిలవకుండా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దోమల కారణంగా ప్రాణాంతకమైన డెంగ్యూతోపాటు మలేరియా, ఫైలేరియా, చికున్ గున్యా ప్రబలే ప్రమాదం ఉందన్నారు. అలాగే కొత్తగా బోరుబావులు, వాగులు, వంకల్లో చేరే వర్షపునీటి కారణంగా డయేరియా, దగ్గు, జ్వరము లాంటి వ్యాధులు సైతం ప్రబలే అవకాశాలున్నాయన్నారు. ఈసీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని పిహెచ్‌సిల్లో మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నీరుకాలుష్యం కాకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లాలన్నారు. ఈకార్యక్రమంలో అడ వైద్యాధికారి సుధాకర్ నాయక్‌తోపాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.