అదిలాబాద్

దళితబస్తీ లబ్దిదారులకు ఉచితంగా విత్తనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూన్ 10: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబస్తీ పథకం అమలులో జిల్లా అగ్రస్థానంలో ఉందని, భూములు పొందిన మహిళలకు పంటసాగు కోసం వంద శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేస్తామని కలెక్టర్ ఎం.జగన్మోహన్ అన్నారు. శుక్రవారం దళిత బస్తీ కింద కొనుగోలు చేసిన భూముల అభివృద్ది, పంటసాగు అంశాలపై కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్షించి, పలు మార్గదర్శకాలు జారీ చేశారు. నిరుపేద దళిత కుటుంబాలకు వ్యవసాయ భూములు కొనుగోలు చేసి ఇవ్వడం ద్వారా సామాజికంగా, ఆర్థికంగా వారి ఎదుగుదలకు ప్రభుత్వం చేయూతనిస్తోందని, ఈ పథకాల ద్వారా పంట దిగుబడులు సాధించి రైతులు ముందుకు సాగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పంపిణీ చేసిన మూడెకరాల భూమిలో ఒక ఎకరంలో తప్పనిసరిగా కూరగాయాలు పండించాలని, ఇందుకోసం అవసరమైన విత్తనాలను వంద శాతం సబ్సిడీపై పంపిణీ చేయాలని హర్చికల్చర్ ఏడిని కలెక్టర్ ఆదేశించారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో మొదటి సారిగా పంటలు సాగు చేస్తున్న రైతులకు భూమి చదును కోసం, ఇతర అవసరాల కోసం అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను, డ్వామా ఏపివోలను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా దళిత బస్తీ భూముల్లో ఫిష్ ప్లాంట్‌లను ఏర్పాటు చేసుకోవాలని, అందుకోసం మత్స్యశాఖ అధికారులు చేప పిల్లలను ఉచితంగా అందించాలని సూచించారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ వారి అభ్యున్నతికి అన్ని విధాల పాటుపడుతుందని అన్నారు. భూములు పంటల సాగుకు అనుకూలంగా ఉన్నాయో లేవో తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొంత మంది తహసీల్దార్లు తమ పరిధిలోని గ్రామాల్లో సాగుకు యోగ్యంగా లేవని, రాళ్ళతో పాటు ఎత్తుపల్లాలు ఉన్నాయని, వాటిని అభివృద్ది చేసి బోరువెల్స్ వేయడంతో పాటు విద్యుత్ సౌకర్యం, మోటారు కనెక్షన్ అందిస్తేనే దళిత మహిళలు వ్యవసాయ భూముల్లో పంటలు సాగుచేసుకునేందుకు వీలు కల్గుతుందని అన్నారు. ఇందుకోసం సర్వే నిర్వహించి, పూర్తి వివరాలను జూన్ 20లోగా దళిత శాఖ ఈడికి అందజేయాలని, అవసరమైతే ఇందుకోసం తాము నిధులు మంజూరు చేస్తామని కలెక్టర్ అన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ మాట్లాడుతూ దళిత బస్తీ పథకంలో భూములు పొందిన లబ్దిదారులకు పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్‌లు జూన్ 25లోగా అందించాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం కొత్తగా చేపట్టిన భూముల క్రమబద్దీకరణలో భాగంగా సాదాబైనామ, జమాబంది, విరాసత్ భూములపై దరఖాస్తు స్వీకరించి, భూవివాదాలు పరిష్కరించాలని అన్నారు. సాదాబైనామ దరఖాస్తు పత్రాలను మీసేవా కేంద్రాల ద్వారా ప్రతి రోజు పరిశీలించి, వెనువెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
చెరువు పనులు చేపట్టిన కాంట్రాక్టర్లపై చర్యలు
తొలి విడతగా మిషన్ కాకతీయ కింద చేపట్టిన 558 చెరువుల్లో 500 చెరువులు గ్రౌండింగ్ అయ్యాయని, పెండింగ్‌లో ఉన్న మిగితా చెరువు పనులను జూన్30లోగా పూర్తిచేయకపోతే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడుతామని కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందునా చెరువు పనులు యుద్దప్రతిపాదికన పూర్తిచేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఆసిఫాబాద్ సబ్‌కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, దళిత శాఖ ఈడి జెమ్స్ కల్వాల్, ఆర్డీవోలు సుధాకర్ రెడ్డి, శివలింగయ్య, ఐలయ్య, డ్వామా ఏపిడి కృష్ణారావు పాల్గొన్నారు.