అదిలాబాద్

అబద్దాలతో కాలక్షేపం చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, జూన్ 10: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మేనిఫెస్టోలో ఉన్న హామీలను నెరవేరుస్తామని హామీలు ఇచ్చి అందమైన అబద్దాలతో రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి కెసిఆర్ మోసం చేస్తున్నాడని టిడిపి జిల్లా అధ్యక్షుడు బోడ జనార్దన్ విమర్శించారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని టిఎన్‌టియుసి కార్యాలయంలో జరిగే టిడిపి పట్టణ కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాపలా కుక్కలా ఉంటానని, దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని, ఆంధ్రులను ఆంధ్రాకు పంపి ఇంటికో ఉద్యోగం ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా కల్లిబొల్లి కబుర్లు చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కోటి ఎకరాలకు నీరందిస్తామన్న హామీని నేటికీ నెరవేర్చలేదన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి నేటికీ రెండు సంవత్సరాలైనా నెరవేర్చలేదన్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాష్ట్ర ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామన్న ముఖ్యమంత్రి నేటికీ అనేక పథకాలతో ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టివేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో టిడిపి పార్టీ పునాదిగా పనిచేస్తే నేడు రాష్ట్రంలో టిడిపి పార్టీ ఉనికే లేకుండా చేయడానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని విమర్శించారు. నేడు రాష్ట్రంలో ఉద్యమ జే ఏసీ, ఎలక్ట్రిసిటీ జెఏసీ, ప్రతిపక్ష జే ఏసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ఇందిరమ్మ ఇండ్లకు బిల్లులు చెల్లించకుండా సి ఐడి ఎంక్వైరీ చేయిస్తూ లబ్దిదారులను ఆందోళనకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. అంతే కాకుండా బెల్లంపల్లి ప్రజలు జిల్లా కోసం ఉద్యమాలు, ఓపెన్ కాస్టుల రద్దు, తాగునీటి ఉద్యమాలు కొనసాగిస్తున్నారని, ఆ ఉద్యమాలకు టిడిపి పార్టీ తరుపున తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ప్రజా సంక్షేమ పథకాలు, బంగారు బతుకమ్మ, రైతుల రుణమాఫీ అంటూ రెండు సంవత్సరాలుగా కాలక్షేపం చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చక ప్రజలను మోసగిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. 2019లో రాష్ట్రంలో టిడిపి పార్టీ అధికారంలోకి వస్తుందని, టీ ఆర్ ఎస్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో టిడిపి నియోజకవర్గ ఇంచార్జి పాటి సుభద్ర, నాయకులు పున్నం చంద్, ముర్కూరి చంద్రయ్య, లక్ష్మి, జలపతి, దామెర శ్రీనివాస్, రాజరత్నం పాల్గొన్నారు.