అదిలాబాద్

ఖానాపూర్ మార్కెట్ చైర్మన్‌గా నల్లా శ్రీనివాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపూర్, జూన్ 10: టిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు నల్లా శ్రీనివాస్‌ను ప్రభుత్వం ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమించింది. ఈమేరకు శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ కారద్యర్శి నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి. నాలుగైదు రోజుల్లో శ్రీనివాస్ పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు నమ్మిన బంటూ, పార్టీ అధికారంలోకి రాకముందు తెలంగాణ సాధన ఉద్యమంలో కూడా కీలకంగా పనిచేశాడు. స్థానిక సంస్థలతోపాటు ఎంపి, ఎమ్మెల్యేల సాధారణ ఎన్నికల్లో కూడా అహోరాత్రులు కష్టపడి పనిచేశారని, ఖానాపూర్ మండలంలో టి ఆర్ ఎస్‌కు ఘనమైన ఫలితాలు సాధించిన విషయంలో నల్ల శ్రీనివాస్‌ది కీలకపాత్ర. ఎమ్మెల్యే రేఖానాయక్ ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్‌గా శ్రీనివాస్ పేరునుప్రతిపాదించిన మేరకు ప్రభుత్వం ఆయనకు ఈ పదవిని కట్టబెట్టింది. ఎమ్మెల్యే రేఖానాయక్ తిరుమలేశుని దర్శనానికి వెళ్లడంతో ఆమె రాగానే ఖానాపూర్ మార్కెట్ యార్డు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటుచేయనున్నారు.