క్రీడాభూమి

అఫ్రీదికి ఇదే చివరి అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాక్ కోచ్ వకార్ యూనస్
కరాచీ, మార్చి 11: భారత్‌లో జరిగే ప్రపంచ టి-20 కప్ టోర్నమెంట్ షాహిద్ అఫ్రీదికి ఒక ప్రధాన టైటిల్ గెలవడానికి చివరి అవకాశమని పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ వకార్ యూనస్ అభిప్రాయ పడ్డాడు. ‘షాహిద్ తన కెరీర్ చివరి దశలో ఉన్నాడు. ఒక పెద్ద టైటిల్ గెలవడానికి అతనికి ఇది చివరి అవకాశమని నేను నమ్ముతున్నాను’ అని భారత్‌కు జట్టును పంపడానికి శుక్రవారం పాక్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత లాహోర్‌లో విలేఖరులతో మాట్లడుతూ వకార్ చెప్పాడు. కాగా, భారత్ వెళ్లడానికి ప్రభుత్వం అనుతి ఇవ్వడం తనకెంతో ఊరటనిచ్చిందని వకార్ అన్నాడు. ‘ఇది నిజంగా మంచి పరిణామం. ఎందుకంటే మేమంతా కూడా భారత్ వెళ్లాలని, అక్కడ బాగా రాణించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ నెల 19న భారత్‌తో జరగబోయే మ్యాచ్ కోసం మేమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అని వకార్ అన్నాడు. అయితే గత ఆరు నెలలుగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జట్టు ఆటతీరు బాగా లేదనే విషయాన్ని ఆయన అంగీకరించాడు. ‘గత ఆరునెలలుగా జట్టు ఫామ్ రానురాను దిగజారుతూ వస్తోంది. అయితే తిరిగి పుంజుకోవడానికి ప్రపంచ టి-20 టోర్నమెంట్ ఒక చక్కటి వేదిక అవుతుందని భావిస్తున్నాను’ అని వకార్ చెప్పాడు. భారత్ వెళ్లడానికి అనుమతి పొందడంలో ఆలస్యం జట్టుపై ప్రభావం చూపుతుందని తాను అనుకోవడం లేదని ఆయన చెప్పాడు. అంతేకాదు అఫ్రీదీతో తనకు విభేదాలున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను సైతం వకార్ ఖండించాడు.