అక్షర

అజరామరం భారతీయ భావజాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ రాఘవం.. శ్రీ మాధవం
(ఒక పౌరాణిక చారిత్రక,
వైజ్ఞానిక వ్యాస సంకలనం)
-హరిబాబు సూరానేని
పుటలు: 168
వెల: రూ.150
ప్రతులకు: జ్యోతి వలబోజు
80963 10140
*
ప్రతి వ్యక్తి యొక్క జీవన గమనం ముఖ్యంగా మూడు అంశాలు ఆధార బిందువులుగా సాగిపోతుంటుంది. అవి - వృత్తి, వ్యావృత్తి, మనోవృత్తి. అందునా రచనా వ్యాసంగంతో ముడిపడి ఉన్న వ్యక్తి విషయంలో ఈ మూడూ అతి ప్రధాన అంశాలు. అలాంటి వ్యక్తి తన వృత్తిరంగంలో - అంటే విధి నిర్వహణలో - చాలా వరకు సమతూకంలోనే సాగిపోతూ ఉండచ్చు. కానీ తన వ్యావృత్తి వైపు మాత్రం కొంత ఎక్కువ మొగ్గుదల, మనోవృత్తి పరంగా కొంత సత్యశోధన - కథనం భావావేశం కలిగి ఉంటాడు. వృత్తిపరంగా సాఫ్ట్‌వేర్ రంగ ఉద్యోగంలో వుంటూ వ్యావృత్తి, మనోవృత్తుల పరంగా ‘ప్రియం బ్రూయాత్ - సత్యం బ్రూయాత్ (ఇతరులకు కమ్మని మాట చెప్పాలి; అది సత్యమైనదై ఉండాలి) అనే దృక్పథపూర్వక ఆత్మవిశ్వాసంతో హరిబాబు సూరానేని ఇటీవల ‘శ్రీరాఘవం! శ్రీ మాధవం!!’ అనే ఒక వ్యాస సంకలనం రచించారు.
రామాయణ కావ్య వైశిష్ట్యం - వాల్మీకి చూపిన పాత్ర చిత్రణా నిపుణత, అయోధ్య రామాలయం పుట్టుపూర్వోత్తరాలు, సమస్యా పరిష్కార సూచనలు, విశ్వసృష్టి క్రమ పరిణామం - పరమాత్మ కర్తృత్వం, భారతీయ పౌరాణిక యుగ కాలగమన గణన విధానం - ఈ అంశాల మీద ఈ పుస్తకంలో అభిరుచి కలిగించే వివిధ విషయ వివరణలు విస్తృతంగా కనిపిస్తాయి.
సీతాగ్ని ప్రవేశ ఘట్టంలోని అంతరార్థం వివరించటంలో రచయిత తన వ్యాఖ్యాత్ప నైపుణ్యాన్ని ప్రస్ఫుటంగా ప్రదర్శిస్తూ ఆ సంఘటనకు సంకేతాత్మక వివరణ ఇచ్చాడు. ఒక యోగ సాధకుడికి సంకేతం రాముడు; సీతాదేవి పరాశక్తికి చిహ్నం; యోగ సాధకుడు భగవంతుడిని నిలదీయటం, భగవత్స్వరూపిణియైన పరాశక్తి యోగ సాధకుడికి తలవంచటం అనే యోగశాస్త్ర రహస్యమే సీత అగ్నిలో దూకటం అంటూ.
మొన్నటి చలం, నిన్నటి నార్ల, నేటి ముప్పాళ్ల రంగనాయకమ్మ, డా.స్వర్ణ వాచస్పతి మొదలైన వారు నాటిన, నాటుతున్న విష వృక్షాలకు ఘాటైన విష క్రిమినాశక మందు లాంటి సమగ్ర ఖండన వ్యాసం 54వ పుట నుంచి 69వ పుట వరకు ‘హిందూ ధర్మ ప్రహేళికలు - రామకథా విజృంభణ’ అనే శీర్షికతో సమర్థవంతంగా సాగిపోయింది. నార్మన్ జాకోబీ అనే ఫ్రెంచి పండితుడికి ‘రామాయణము - సంస్కృతి’ అనే దాని గురించి దొరికిన, తట్టిన, అర్థమైన ఉదాత్త భావాన్వయం కూడా వామపక్ష వాదులకు తెలియలేదు అని చెప్పటానికి 20వ పేజీలో సోదాహరణ వివరణ కనిపిస్తుంది.
‘క్రీ.పూ.4-12-7323న రామజననం, క్రీ.పూ.7-4-7307న శ్రీరామ కళ్యాణం, క్రీ.పూ.29-11-7306 న వనవాసారంభం జరిగాయి’ ఇలాగే తేదీలతో హనుమంతుని లంకా ప్రవేశం, సేతు నిర్మాణం, సమర ప్రారంభం, రావణ వధ, రాముని అయోధ్యా పునః ప్రవేశం మొదలైన పది ఘట్టాలు ఫలానా ఫలానా తేదీల నాళ్ల జరిగాయి అనే గణాంక వివరాలు కూడా 64వ పేజీలో స్పష్టంగా ఇచ్చాడు రచయిత. వాటిని డా.పి.వి.వర్తక్ మహాశయుడు వివిధ గ్రహ, నక్షత్రాల సంచారం, ఖగోళ విజ్ఞానం, నేటి కార్బన్ డేటింగ్ విధానం మొదలైన వాటి ఆధారంగా లెక్కవేసి మరీ చెప్పినట్లు ఈ పుస్తకం ద్వారా తెలుస్తుంది. ఇటీవల అమెరికన్ సైన్స్ ఛానల్‌లో సైంటిస్టులు కూడా రామసేతువు 7వేల సంవత్సరాల కింద మానవుల చేత నిర్మితమైంది: ఇది తమ పరిశోధనలలో తేలింది అని చెప్పిన వాస్తవం కూడా ఇక్కడ స్మరణార్హం, గమనార్హం.
క్రీ.శ.1530 ప్రాంతంలో బాబర్ అయోధ్య రామాలయాన్ని కూల్చేసి, దాని పునాదుల మీద మసీదు కట్టిన నాటి నుంచి సంవత్సరాలతో సహా రామాలయ పునర్నిర్మాణం కోసం రామభక్తులు చేసిన పోరాటాలు, 1947 తర్వాత జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వపు కుహనా సెక్యులరిస్టుల నాటకాలు, న్యాయస్థానాలు, వాదాలు, వివాదాలు - అన్నీ విశదంగా తెలియజేశారు. 70వ పేజీ నుంచి సాగిన 44 పుటల సుదీర్ఘ వ్యాసం. అంతేకాకుండా ఈ రచయిత సంఘర్షణాత్మక వైఖరిని సమర్థించకుండా సమస్యా పరిష్కారానికి కొన్ని సూచనలు కూడా చేశారు. సాధారణ ముస్లిం సోదరుల సానుభూతి, సహకార హృదయం, కలుపుగోలుతనాలను కూడా మనసులో పెట్టుకొని మంచి సలహాలిచ్చారు హరిబాబు.
128వ పుట నుంచి 165వ పుట వరకు విశ్వ ఆవిర్భావం గురించి భారతీయ ప్రాచీన వాఙ్మయంలోని పెక్కు సాధికార అంశాలతో సహా చేసిన విశేష అధ్యయనం కనిపిస్తుంది. దీనిలో పాశ్చాత్య విజ్ఞానవేత్తల బిగ్‌బ్యాంగ్ (మహా విస్ఫోటన) సిద్ధాంతం మొదలైన వాటిని కూడా సమన్వయించుకుంటూ చెప్పిన విధము, వైనము బాగున్నాయి.
‘అహోరేవ సంవత్సర’ కాల సిద్ధాంతం ప్రకారం శ్రీరాముని వంటి పురాణ పురుషుల రాజ్యపాలనా కాల వ్యవధులు వేల సంవత్సరాలుగా చెప్పారు. కాని అక్కడ ఒక సంవత్సరం అంటే ఒకరోజు అని ఆ ప్రత్యేక గణిత శాస్త్ర విభాగం ప్రకారం లెక్కించుకోవాలి. అప్పుడు మన లెక్కలన్నీ సరిపోతాయి’ అని చాలా తేలిక పద్ధతిలో చాలా చిక్కులను పరిష్కరించారు 60, 61వ పేజీల్లో సూరానేని వారు మహాభారతం ఆధారంగా.
ఈ పుస్తకంలోని నెరసు (కళంకము) వంటి కొన్ని అచ్చ తెలుగు పలుకులు రచయిత యొక్క భాషాభిమాన జన్యువులలోని తెలుగుదనాన్ని తెలియజేస్తాయి.
117వ పుటలో ఉన్న ‘ఔపోసన’ అన్న పదం సరికాదు. ‘ఆపోశన’ అనాలి. ఆపః + అశన అంటే నీటిని ఆహారంగా పుచ్చుకోవటం.
69వ పేజీలోని ‘ప్రతి మనిషీ మనీషి కావటానికి చేసే ఆధ్యాత్మిక ప్రయాణంలో రామకథ గర్భితమై నడుస్తూనే ఉంటుంది’ అనే ఉదాత్త భావనకు వ్యాఖ్యానప్రాయంగా రచించిన ఈ పుస్తకానికి ‘శ్రీ రాఘవం! శ్రీమాధవం!’ అని చేసిన నామకరణం సర్వార్థ సముచిత, సంభరితంగా ఉంది.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం