జాతీయ వార్తలు

ఉగ్రవాదులు చొరబాటుతో హై అలెర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలోకి నలుగురు ఉగ్రవాదులు చొరబడ్డారని ఇంటలిజెన్స్ ఇచ్చిన నివేదికతో దేశవ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. అఫ్గానిస్థాన్‌ పాస్‌పోర్టులతో పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ ఏజెంట్‌ సహా నలుగురు తీవ్రవాదులు గుజరాత్‌ తీరం నుంచి భారత్‌లోకి ప్రవేశించారని దేశంలోని అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ నెల మొదటి వారంలోనే వారు దేశంలోకి చొరబడినట్లు తమకు కీలక సమాచారం అందిందని కేంద్ర నిఘావర్గాలు వెల్లడించాయి. ఆ నలుగురూ ఏసమయంలోనైనా విధ్వంసక చర్యలకు తెగబడే అవకాశముందని, నలుగురి ఛాయాచిత్రాలను స్థానిక పోలీసులకు ఐబీ అందించింది. వీరు ఏ క్షణంలోనైనా దాడులకు పాల్పడొచ్చని ఐబీ హెచ్చరికలు జారీ చేసింది. వాహన తనిఖీలు, నాకాబందీతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.