జాతీయ వార్తలు

భారత్‌కు అండగా అమెరికా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లోని పూల్వామాలో జరిగిన ఉగ్రదాడిని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియా ఖండించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఉగ్రదాడి అత్యంత భయానకమైందని పేర్కొన్నారు. భారత్‌కు అండగా నిలుస్తామని అన్నారు. అమెరికా అంతర్జాతీయ భద్రతకు ప్రమాదకరంగా మారిందని ఆయన హెచ్చరించారు. అమెరికా భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌.. భారత భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌తో ఫోన్లో మాట్లాడి సంతాపం ప్రకటించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో పూర్తి మద్దతు ఇస్తామని బోల్టన్‌ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఉగ్ర సంస్థలకు ఆశ్రయం ఇవ్వడాన్ని, సాయం అందించడాన్ని తక్షణమే మానుకోవాలని పాకిస్థాన్‌కు అమెరికా గట్టి హెచ్చరిక చేసింది.