జాతీయ వార్తలు

కేంద్రమంత్రి మృతికి పలువురు సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత అనంతకుమార్ మృతికి పలువురు సంతాపం తెలిపారు. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ప్రగాఢ సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. దేశ సేవ కోసం యుక్తవయసులో రాజకీయాల్లోకి వచ్చారని, మంచి మిత్రుడ్ని కోల్పోయానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇంకా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, రాజనాథ్ సింగ్, కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్ తదితరులు సంతాపం తెలిపారు.