జాతీయ వార్తలు

కాలుష్య నియంత్రణకు.. అయితే ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రైవేటు వాహనాలపై ఆంక్షలను సమర్థించిన చీఫ్ జస్టిస్
న్యూఢిల్లీ, డిసెంబర్ 6: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం స్థాయిని తగ్గించడానికి సరి, బేసి నంబర్లు ఉండే ప్రైవేటు వాహనాలను రోజు విడిచి రోజు నడవడానికి అనుమతించాలన్న ఆప్ ప్రభుత్వం నిర్ణయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ సమర్థించడమే కాదు, సమస్యను తగ్గించడానికి తోడ్పడినట్లయితే దాన్ని పాటించవచ్చని అన్నారు. ఢిల్లీలో కాలుష్యం సమస్య చాలా తీవ్రంగా ఉందని, దాన్ని అదుపు చేయాలంటే కఠిన చర్యలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సుప్రీకోర్టు జడ్జీలు ఈ విధానాన్ని పాటించి కోర్టుకు చేరుకోవడానికి కారు పూలింగ్ విధానాన్ని పాటించడం ద్వారా త్యాగం చేస్తారా అని విలేఖరులు అడగ్గా, కాలుష్యాన్ని తగ్గించడానికి తోడ్పడినట్లయితే దాన్ని పాటించడం తమకు సంతోషమేనని ఠాకూర్ అన్నారు. అంతేకాదు అది త్యాగంగా భావించాల్సిన పని లేదని, దీన్నో సందేశంగా భావించాలన్నారు. ‘అందులో ఇబ్బంది ఏమీ లేదు. జనం దీన్ని త్యాగం అని అనవచ్చు కానీ, ఇది త్యాగం కాదు, జడ్జీలు కూడా ఈ పని చేస్తున్నారని చెప్పే ఓ చిన్న పాటి చర్యమాత్రమే’నని ఆయన అన్నారు. వచ్చే జనవరి 1నుంచి ఢిల్లీ రోడ్లపై ప్రత్యామ్నాయ రోజుల్లో సరి, బేసి నంబర్లుండే ప్రైవేటు వాహనాలు మాత్రమే నడవడానికి అనుమతించడం జరుగుతుందని అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి దీన్ని ఎలా పాటిస్తారని అడగ్గా, తన పొరుగున ఉన్న మరో జడ్జి ఎకె సిక్రీతో కారును పంచుకుంటానని ఠాకూర్ చెప్పారు. తాను ఇటీవల జమ్మూనుంచి ఢిల్లీకి విమానంలో వస్తున్నప్పుడు పంజాబ్‌లో రైతులు పంటలను తగులబెట్టడం కారణంగా ఆకాశంలో దట్టమైన పొగలు కమ్ముకునిపోయిన అనుభవాన్ని ఠాకూర్ గుర్తు చేసుకున్నారు. తాను ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ప్రస్తావించానని, దీనిగురించి తాను తన రేడియో కార్యక్రమం ‘మన్‌కీ బాత్’లో కూడా మాట్లాడినట్లు ఆయన చెప్పారని ఠాకూర్ అన్నారు. కాలుష్యం సమస్య గురించి రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అన్నారు.