అనంతపురం

గుబులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, నవంబర్ 21 : జిల్లాలోని పలువురు పోలీసులు, అటవీ శాఖ అధికారులకు కొల్లం గంగిరెడ్డి గుబులు పట్టుకుంది. కడప జిల్లాకు చెందిన కొల్లం గంగిరెడ్డి అంతర్జాతీయ స్మగ్లర్‌గా పేరు గాంచడంతోపాటు పోలీసులకు పట్టుబడడంతో ఇందులో పరోక్ష, ప్రత్యక్ష పాత్ర ఉన్న పలువురు అధికారులకు భయం పట్టుకుంది. జిల్లాలోని కర్నూలు, కడప, చిత్తూరు జిల్లా సరిహద్దులతోపాటు చెనే్నకొత్తపల్లి, ఆత్మకూరు, పెనుకొండ తదితర ప్రాంతాలు ఎర్ర చందనం డంపింగుకు అడ్డాగా మారాయి. జిల్లాలోకి పెద్ద ఎత్తున ఎర్ర చందనం దుంగలు రావడం, ఇక్కడ నిల్వ చేయబడడం వెనుక జిల్లాను సేఫ్ జోన్‌గా ఈ ముఠా భావించినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. జిల్లాలోని ఆత్మకూరు మండలం వడ్డిపల్లికి చెందిన ఒక వ్యక్తిని ఎర్ర చందనం ప్రమేయంతోనే హత్య చేసినట్లు ప్రచారంలో ఉంది. దీంతోపాటు గతంలో కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పనిచేసి ఎర్ర చందనం ముఠాతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు కలిగి ఇక్కడకు వచ్చిన పలువురు పోలీసు, రెవెన్యూ, అటవీ శాఖలకు చెందిన ఉద్యోగుల్లో సైతం కొల్లం గంగిరెడ్డి భయం వెంటాడుతోంది. ఇతను నోరు విప్పితే ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయోనన్న భయం పలువురిని వెంటాడుతుండగా ఎర్ర చందనం వ్యాపారం చేసే వారు సైతం భయం భయంగా గడుపుతున్నారు. తాజాగా పోలీసులు అందించిన సమాచారం ప్రకారం రాయలసీమ వ్యాప్తంగా ఒక్క పోలీసు శాఖ లోనే సుమారుగా 759 మంది వరకూ పోలీసులకు ప్రమేయం ఉండవచ్చని భావిస్తున్నారు. ఇందులోక్షేత్ర స్థాయి సిబ్బంది మొదలుకుని ఉన్నత స్థాయి అధికారి వరకూ పాత్రధారులుగానో, సూత్రధారులుగానో ఉండడం గమనార్హం. ఇక వీరితోపాటు అటవీ, రెవెన్యూ, వివిధ రాజకీయ పార్టీల నాయకులు మొదలగు వారిని గుర్తిస్తే ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.

నిధుల కోసం నేడు బాలయ్య ఢిల్లీ బాట..

హిందూపురం, నవంబర్ 21: లేపాక్షి ఉత్సవాలు, నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి నిధుల కోసం స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదివారం ఢిల్లీకి బయలుదేరనున్నారు. కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు, రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్‌లతో కలిసి రెండు రోజుల పాటు బాలకృష్ణ ఢిల్లీలో మకాం వేయనున్నారు. ఫిబ్రవరి 27, 28వ తేదీల్లో నిర్వహించనున్న లేపాక్షి ఉత్సవాల కోసం కేంద్ర మంత్రులను ఆహ్వానించనున్నారు. అదే విధంగా ప్రత్యేకంగా లేపాక్షి ఉత్సవాలకు నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు ఇవ్వనున్నారు. దీనికి తోడు హిందూపురం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులపై ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులకు నివేదికలు పంపగా వాటిపై కూడా చర్చించనున్నారు. హిందూపురంలో రింగ్ రోడ్డు ఏర్పాటు, తాగునీటి పథకం కోసం ప్రత్యేక పైపులైన్లు, రైల్వే స్టేషన్ పురోభివృద్ధి, చైనా సిల్క్ దిగుమతిపై సుంకం పెంచడం, వౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులను కోరనున్నారు. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కారీ, బీరేంద్రసింగ్ తదితర కేంద్రమంత్రులను బాలకృష్ణ బృందం కలువనుంది. హిందూపురం నియోజకవర్గంలో పట్టు పరిశ్రమపై ఆధారపడి వేలాది రైతు కుటుంబాలు జీవనం సాగిస్తున్నందున చైనా సిల్క్ యధేచ్చగా దిగుమతి అవుతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయమై పలుమార్లు ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎపి రైతు సంఘం ప్రతినిధులు వినతిపత్రాలు అందచేశారు. దీంతో ప్రత్యేకంగా సంబంధిత కేంద్ర మంత్రులను కలిసి చర్చించనున్నారు. లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని బాలకృష్ణ పట్టుదలతో ఉండగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేక నిధుల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆయా ప్రతిపాదనలపై శనివారం హైదరాబాద్‌లో పిఏలు కనుమూరి శేఖర్, బాలాజీలతో ఎమ్మెల్యే బాలకృష్ణ చర్చించారు.