అనంతపురం

పుష్కరాలకు రెండు ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, ఆగస్టు 12 : గుంతకల్లు నుంచి కృష్ణా పుష్కరాలకు ఏ ర్పాటు చేసిన ప్రత్యేక రైలును గుంతకల్లు రైల్వే డివిజినల్ మేనేజర్ గోపీనాథ్‌మాల్య శుక్రవారం ప్రారంభించా రు. గుంతకల్లు నుంచి ప్రధాన స్టేషన్ ల మీదుగా రాయచూర్ సమీపంలో కృష్ణా రివర్ స్టేషన్‌కు ఏర్పాటు చేసిన 07955 గుంతకల్లు - కృష్ణా ప్రత్యేక రైలును డిఆర్‌ఎంతోపాటు సీనియర్ డిఎంఇ డీజల్ రమణ, ఎస్‌ఎంఆర్ ల క్ష్మానాయక్, క్రూకంట్రోలర్ షరీఫ్ ప్రారంభించారు. అలాగే 07955/54 గుంతకల్లు - కృష్ణా- తిరుపతి మధ్యా హ్నం 12 గంటలకు గుంతకల్లు నుంచి కృష్ణా రివర్ స్టేషన్‌కు చేరుకుంటుందని, అదేవిధంగా తిరుపతి నుండి రాత్రి 11 గంటలకు బయలుదేరిన ప్రత్యేక పుష్కర రైలు తెల్లవారుజామున 5 గంటలకు గుంతకల్లుకు చేరుకుంటుందన్నారు. తిరిగి మధ్యాహ్నం 12.50 గుంతకల్లు నుంచి బయలుదేరిన రైలు 7.25కు తిరుపతి చేరుకుంటుంది. అదేవిధంగా శుక్రవారం హుబ్లీ నుండి తిరుపతికి స్పెషల్ రైలును ఏర్పాటు చేశారు. గుంతకల్లు స్టేషన్‌కు మధ్యా హ్నం 2 గంటలకు బయలుదేరనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
గుంతకల్లు డిఆర్‌ఎం బదిలీ!
గుంతకల్లు రైల్వే డివిజినల్ మేనేజర్ గోఫీనాథ్‌మాల్య బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. డిఆర్‌ఎంగా పని చేస్తున్న బి గోపీనాథ్‌మాల్యను ఈస్ట్ సెంట్రల్ రైల్వేలోని బిలాస్‌పూర్ డివిజన్‌కు బదిలీ చేశారు. అదేవిధంగా సెంట్రల్ రైల్వేలోని ముంబయి డిఆర్‌ఎంగా పని చేస్తున్న అమితాబ్ ఓజాను గుంతకల్లు డివిజనల్ రైల్వే మేనేజర్‌గా బదిలీ చేస్తూ జోనల్ కేంద్రానికి ఉత్తర్వులు అందినట్లు సమాచారం.