అనంతపురం

హెచ్చెల్సీ నుంచి సాగునీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కణేకల్లు, ఆగస్టు 18: హెచ్చెల్సీ కింద సాగుచేసిన పంటలుకు చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు బుధవారం నీటిని విడుదల చేశారు. స్థానిక శ్రీ చిక్కణేశ్వర స్వామి వడియార్ చెరువు సమీపం వద్ద కణేకల్లు రెండవ తూము నీటిని విడుదల చేశారు. ముందుగా శ్రీ చిక్కణేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నపూర్ణేశ్వరీ రైస్ మిల్లులో విలేఖరులతో మాట్లాడుతూ తుంగభద్ర జలాశయంలో నీటి శాతం తక్కువగా వుండటం వల్ల రైతులు వరి సాగు చేసుకోరాదని, తడి పైరులు మాత్రమే సాగు చేసుకోవాలని సూచించారు. డ్యాం ఎగువ ప్రాంతంలో వర్షాలు కురవకపోవడం వల్ల డ్యామ్‌లో నీరు చేరకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయన్నారు. రైతులు పరిస్థితి గమనించి ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. హంద్రీనీవా ద్వారా ఉరవకొండ, రాయదుర్గం, కల్యాణదుర్గం ప్రాంతాలకు కృష్ణా జలాలను తరలించి తాగు, సాగునీటి కష్టాలు తీర్చడానికి ప్రణాళిక ప్రారంభమవుతుందన్నారు. దీనివల్ల నియోజక వర్గంలో 27 వేల ఎకరాలు సాగు చేసుకునే అవకాశం వుందన్నారు. ఈ ప్రాంతంపై అపారమైన అప్యాయత వుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు హంద్రీనీవాకు రూ. 340 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. దీనివల్ల కణేకల్లుకు 20 వేల ఎకరాలు, రాయదుర్గంకు 5 వేల ఎకరాలు, గుమ్మఘట్ట మండలంలో 800 ఎకరాల సాగునీరందుతుందన్నారు. సొల్లాపురం, హనుమాపురం నల్లరేగడి పొలాలకు సైతం నీటితో పంటలు సాగు చేసుకోవచ్చనన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఇ శేషగిరి రావు, ఇఇ వెంకటరమణారెడ్డి, డిఇఇ రామసంజన్న, ఎఇలు మారుతి ప్రసాద్, దివాకర్‌రెడ్డి, తహసీల్దార్ వెంకటశేషు, ఎంపిడిఓ రెహనాబేగం, మార్కెట్ యార్డు చైర్మన్ చంద్రహాస్, వైస్ చైర్మన్ వన్నారెడ్డి, ఎంపిపి ఫాతిమా బీ, ఎంపిటిసి ఫకృద్ధీన్, ఉప సర్పంచ్ ఆనందరాజ్, నీటి సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ గుప్తా, ఉపాధ్యక్షులు రమేష్, రైతులు పాల్గొన్నారు.