అనంతపురం

జిల్లాకు రూ. 6 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెళుగుప్ప, ఆగస్టు 19:జిల్లాకు 6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినందుకు ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, మండల నాయకులు ప్రత్యేకంగా రాష్టమ్రుఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని జీడిపల్లి జలాశయం వద్ద కృష్ణమ్మ విగ్రహవిష్కరణకు విచ్చేసిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ కరవు జిల్లా అనంతపురంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించాడన్నారు. జిల్లా అభివృద్ధి కోసం రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారన్నారు. వ్యవసాయంతో పాటు పశుగణాభివృద్ధికి రూ.776 కోట్ల నిధులను మంజూరు చేశారన్నారు. అలాగే 120 కోట్ల పంట నష్ట పరిహారాన్ని జిల్లా రైతంగానికి అందించారన్నారు. నదులు అనుసంధానంతోనే రాష్ట్రాల అభివృద్ధి జరుగుతుందన్న ఉద్ధేశ్యంతో గోదావరి, కృష్ణలను అనుసంధానం చేసి సాగు, తాగునీరందిస్తారన్నారు. సెప్టెంబర్ 2వ తేదీ నాటికి హంద్రీనీవాను పూర్తి చేసి మడకశిర, హిందూపురం వరకు నీటిని అందిస్తారన్నారు. హంద్రీనీవా 36 ప్యాకేజీకి 355.14 కోట్ల నిధులను కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. సిఎం సహకారంతో నియోజక వర్గ హార్టికల్చర్ హబ్‌గా మార్చాలన్నదే తన ధ్యేయమన్నారు. డిసెంబర్ నాటికి నియోజకవర్గంలోని చెరువులకు అన్నిటికి హంద్రీనీవాను అందించి సాగునీరు, తాగునీరుకి కొరత లేకుండ చేస్తామన్నారు. జిల్లా తెలుగుయువత అధ్యక్షులు పవన్‌కుమార్, జిల్లా కార్యదర్శి మల్లికార్జున, ఉపాధ్యక్షులు పెద్ద తిప్పయ్య, ఎంపిటిసిలు కంచు రాముడు, ఎర్రెగౌడ్, సర్పంచ్ వెంకటనాయుడు పాల్గొన్నారు.