అనంతపురం

రైల్వే మహిళా ఉద్యోగినిపై హత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, ఆగస్టు 22:పట్టపగలు రైల్వే డీజల్‌షెడ్ గేట్ ముందు సోమవారం మహిళా రైల్వే ఉద్యోగిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేశాడు. ఈ సంఘటనకు సంబందించి పోలీసులు, స్తానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంతకల్లు రైల్వేషెడ్‌లో సీనియర్ డిఎంఇ కార్యాలయం కార్యాలయ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సుకన్య సాయంకాలం విధులు ముగించుకుని బయలు దేరింది. రెప్పపాటు కాలంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి కళ్లలోకి కారం చల్లి కత్తితో ముఖంపై దాడి చేశాడు. అనంతరం కడుపులోకి కత్తి దించి పరారయ్యాడు. దీంతో రక్తపు మడుగులో పడి కొట్టుకుంటున్న ఆమెను చూసి, తోటి ఉద్యోగులు ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వన్ టౌన్ ఎస్‌ఐ నగేష్‌బాబు, ఇన్‌చార్జి సిఐ గురునాథ్‌బాబులు సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను వైద్య చికిత్సల నిమిత్తం రైల్వే ఆసుపత్రికి తరలించారు. కడుపులో కత్తి తీస్తే వెంటనే మృతి చెందే అవకాశం ఉందని, శస్త్ర చికిత్సలు చేసి కత్తిని బయటకు తీయాల్సి ఉంటుందని, ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. రైల్వే ఉద్యోగి సుకన్య, ఆమె భర్త రఘుల మద్య కుటుంబ కలహాలతో భర్తపై ఇదివరకే పోలీసులు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు తెలిపారు. వివాదాల కారణంగా గత మూడు మాసాలుగా విధులకు గైర్హాజరు కావడంతో పర్సనల్ బ్రాంచ్‌లో పని చేస్తున్న సుకన్యను గత నాలుగు రోజుల క్రితం డీజల్‌షెడ్‌కు బదిలీ చేశారన్నారు. విధులు ముగించుకుని వస్తున్న ఆమెపై భర్త కత్తితో దాడి చేసింటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ట్రాక్టర్ బోల్తా వ్యక్తి మృతి
గార్లదినె్న, ఆగస్టు22:మండల పరిధిలోని పెనకచర్ల కొత్తపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి ట్రాక్టర్ కిందపడి పుల్లన్న (40) మృతి చెందాడు. పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు మృతుడు తన స్వంత పొలంలో సేద్యం చేసుకుని తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమద్యలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడడంతో పుల్లన్నకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా డాక్టర్ల సలహామేరకు మెరుగైన చికిత్స కోసం బెంగుళూరు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య రామంజినమ్మ, కూతుర్లు వసుంధర, మమత ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
దస్తావేజులేఖరిపై కొడవలితో దాడి
మడకశిర, ఆగస్టు22:పట్టణంలోని సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంలో సోమవారం దస్తావేజులేఖరి అతావుల్లా (52)పై అగళి మండలానికి చెందిన బసవరాజు అనే వ్యక్తి కొడవలితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బసవరాజు, అతని సోదరుల కుటుంబాల నడుమ ఓ భూ వివాదం చోటు చేసుకొంది. తమ పూర్వీకుల భూమి తనకు దక్కక పోవడానికి గతంలో ఇక్కడ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఆంజనేయులు నాయక్, దస్తావేజులేఖరి అతావుల్లాలు కారణమని బసవరాజు కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో కార్యాలయంలో ఓ రిజిస్ట్రేషన్ విషయమై అతావుల్లా అధికారులతో చర్చిస్తుండగా బసవరాజు వెనుక వైపు నుండి కొడవలితో దాడి చేశాడు. అక్కడే ఉన్న కొందరు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా బసవరాజు స్థానిక పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు. దాడిలో గాయపడిన అతావుల్లాను చికిత్సల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు హిందూపురంకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్న, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ తదితరులు గాయపడ్డ అతావుల్లాను పరామర్శించి దాడికి పాల్పడ్డ బసవరాజును కఠినంగా శిక్షించాలని సూచించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.