అనంతపురం

వన్య మృగాలను సంరక్షించుకోవడం మన బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వన్య మృగాలు, వన్య ప్రాణుల్ని సంరక్షించుకోవడం మనందరి బాధ్యత. జిల్లాలో గత ఐదేళ్ల కాలంలో చిరుత సంఖ్య విపరీతంగా పెరిగింది. అడపాదడపా అవి జనావాసాల్లోకి వస్తుంటాయి. తమ శాఖ అన్ని రకాల రక్షణ చర్యలు చేపడుతోంది. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. సాధ్యమైనంత వరకు వన్య ప్రాణుల్ని చంపరాదు. కుక్కల మాంసమంటే చిరుతలకు మహా ఇష్టం. కనుక మేకలు, గొర్రెల కాపరులు అడవిలోకి వెళ్లినపుడు జాగ్రత్తగా ఉండాలి. కుక్కల్ని అనుసరించే అవి ఎక్కువగా గ్రామ సమీపం లేదా గ్రామాల్లోకి వస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అటవీ సిబ్బందికి, రెవెన్యూ, పోలీసు యంత్రాంగానికి సమాచారం ఇచ్చి సహకరించాలి. అడవిని కాపాడుతున్నందున చెట్లు పెరగడంతో చిరుతల సంతానోత్పత్తి కూడా బాగా పెరిగింది.