అనంతపురం

హడలెత్తించిన చిరుతలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయదుర్గం రూరల్, ఆగస్టు 25 : రాయదుర్గం పట్టణంలో రెండు చిరుతపులలు జనాన్ని పరుగులు తీయించాయి. పట్టణంలోని కొలిమి బజార్ ప్రాంతం లో ఉన్న పొదల్లో దాక్కున్న చిరుతలు జనానికి కంటిమీద కునుకు లేకుండా చేశాయి. వీటిలో ఒకదాన్ని అతి కష్టంపై అటవీశాఖ అధికారులు పట్టుకోగలిగారు. మరో చిరుత అక్కడే దాక్కోవడంతో రాత్రి దాన్ని పట్టుకునేందుకు నానా తంటాలు పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10:30 గంటల సమయంలో కొలిమివీధిలో ఒక ఇంటి ముందు ఉన్న ఆవుపై దాడి చేసేందుకు ప్రయత్నించగా యజమాని అప్రమత్తమై చిరుతను రాళ్లతో కొట్టి తరిమాడు. దీంతో అది సమీపంలోని ముళ్ళ కంపల్లో దాక్కుంది. అటుగా వెళ్తున్న రవి నాయక్ చిరుతను గుర్తించి ముళ్ల కంపల పొదల్లోకి వెళ్లి చూస్తుండగానే చిరుత అతనిపై దాడి చేసింది. దీంతో బిగ్గరగా అరుచుకుంటూ పొదల్లో నుంచి బయటకు పరుగుతీశారు. చిరుత దాడిలో రవినాయక్‌కు కాలికి గాయమైంది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏఎస్‌ఐ నారాయణ, సిబ్బంది తిమ్మరాజు, అమర్‌లు చిరుత సంచరిస్తున్న ప్రదేశానికి చేరుకొన్నారు. అనంతరం అటవీ శాఖ అధికారి తిరుపతినాయుడుకు సమాచారం ఇచ్చారు. అప్పటికే పట్టణంలో చిరుత సమాచారం దావానలా వ్యాపించడంతో భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు ప్రజలను అదుపుచేయడం సాధ్యం కాలేదు. పందుల పెంపకందారులను పిలిపించి వారి వద్ద ఉన్న వలలను ముళ్ల కంపల పొదళ్ళ చుట్టూ కట్టించారు. ఈ దశలో కొందరు ముళ్ల కంపల్లో దూరి కేకలు వేస్తూ చిరుతను బయటకు తరిమారు. బయటకు వచ్చిన చిరుత ఫ్రజల మధ్య నుంచి పరుగులు తీస్తూ సమీపంలో ఉన్న మీసేవా కేంద్రం కాంపౌండ్‌లోకి వెళ్లి చెట్టుపైకి ఎక్కి కూర్చొంది. దీంతో మీ సేవా కేంద్రంలోని కాంపౌండ్‌లోను, బయట వలలు వేశారు. దాదాపు అరగంటపాటు చెట్టుపై నుంచి చిరుత కిందికి దిగి రాకపోవడంతో ఒక యువకుడు ధైర్యం చేసి చెట్టుపైకి ఎక్కి గట్టిగా ఊపడంతో చిరుత కిందకు దూకింది. మళ్ళీ వలలను తప్పించుకొని ముళ్ల పొదల్లోకి దూరింది. ముళ్ళ కంపల వద్ద ఒకవైపు వల వేస్తుండగానే మరోవైపు యువకులు రాళ్లతో బెదిరించంతో చిరుత బయటకు వచ్చి వలలో చిక్కు కుంది. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా వలలో ఉన్న చిరుతను ఒడిసి పట్టుకొని బంధించారు. చిరుతను బంధించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే చిరుతను వాహనంలోకి వేసుకొని హుటాహుటిన అనంతపురం తరలించారు.
కాగా గురువారం రాత్రి 9 గంటల సమయంలో స్థానికులు అక్కడే మరో చిరుతను గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. దాదాపు 15 మంది సిబ్బందితో చిరుతను పట్టుకునేందు చర్యలు చేపట్టారు. అటవీ శాఖ అధికారి శ్రీపతినాయుడుతో చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు చర్చించి పరిస్థితి ఆరా తీశారు. ప్రజలకు హాని కలగకుండా వెంటనే చిరుతను బంధించాలని సూచించారు. అటవీ శాఖ అధికారి శ్రీపతినాయుడు మాట్లాడుతూ వీలైనంత తొందరగా చిరుతను బంధిస్తామని తెలిపారు. పైతోట సమీపంలోని కొండపై రఘుకు చెందిన మేకల మందపై దాడి చేయడంతో మూడు మేకలు చనిపోయాయి.