అనంతపురం

నిరుపేదలందరికీ ఇళ్లు నిర్మిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తచెరువు, ఆగస్టు 27 : నిరుపేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, ఎంపి నిమ్మల కిష్టప్ప అన్నారు. శనివారం మండల కేంద్రంలో 450 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చే శారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టాలు మంజూరు చేయడమే కాకుండా ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. రాష్ట్రంలో లోటుబడ్జెట్ ఉన్నా సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామన్నారు. నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రజలు గుర్తు పెట్టుకోవాలన్నారు. అదేవిధంగా జిల్లాలో పరిస్థితి గమనించిన ముఖ్యమంత్రి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారన్నారు. ఎమ్మెల్యే వరదాపురం సూరి మాట్లాడుతూ సం క్షేమ పథకాల అమలులో దేశానికే రా ష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి వాణి, జడ్పీటీ సీ మహాలక్ష్మి, మండల కన్వీనర్ రమేష్‌నాయుడు, మాజీ జడ్పీటీసీ లక్ష్మీనారాయణ, పెనుకొండ మార్కెట్‌యార్డు వైస్‌చైర్మన్ రఘుపతి, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు రవిచంద్ర, జిల్లా టిడిపి కార్యదర్శి శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యుడు దాల్‌మిల్ సూరి, తహశీల్దార్ వసంతకుమార్, డిప్యూటీ తహశీల్దార్ స్వర్ణలత పాల్గొన్నారు.
పిఎబిఆర్‌కు 520 క్యూసెక్కుల నీటి మళ్లింపు
* ఎంపిఆర్‌కు సరఫరా బంద్
ఉరవకొండ, ఆగస్టు 27 : తుంగభద్ర ఎగువ కాలవలోని హెచ్‌ఎల్‌సిలోని 189వ కిలోమీటర్ వద్ద ఉన్న మోపిడి లింక్ ఛానల్ నుంచి శనివారం పిఎబిఆర్‌కు 520 క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నట్లు హెచ్‌ఎల్‌సి అధికారులు తెలిపారు. తుంగభద్ర జలాశయంలో నీటిమట్టం తగ్గి పోవడంతో హెచ్‌ఎల్‌సి కాలవకు 800 క్యూసెక్కుల నీటిని మాత్రమే ఇస్తున్నారు. ఇందులో భాగంగా పిఎబిఆర్‌కు 520, జిబిసి కాలవకు 250 క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నారు. ఎంపిఆర్‌కు నీటి సరఫరా బంద్ చేసినట్లు అదికారులు తెలిపారు. పిఎబిఆర్ వద్ద ఉన్న జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేసి ఎంపిఆర్ రిజర్వాయర్‌కు 800 క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నట్లు తెలిపారు.