అనంతపురం

ఉత్పత్తి రంగాలపై కేంద్రం దృష్టి సారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, ఏప్రిల్ 3: కేంద్రప్రభుత్వం ఉత్పత్తి రంగాలపై దృష్టి సారించడం లేదని, దీని వల్ల దేశాభివృద్ధి తిరోగమనం వైపు పయనిస్తుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ పేర్కొన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ రంగ సంస్థలు కోట్లాది రూపాయలు బ్యాంకుల ద్వారా రుణాలను తీసుకుని, విదేశాలకు పారిపోతుంటే కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగోట్టెందుకు యూనివర్శిటీలను బిజెపి ప్రభుత్వం వేధికగా చేసుకుందన్నారు. ఎబివిపి కేంద్ర ప్రభుత్వం అండగా వుండి విద్యార్థి సంఘాల నాయకులపై దేశ ద్రోహం కేసులు నమోదు చేయించారన్నారు. దేశంలో మతోన్మాదాలు రెచ్చగొట్టడం, యూనివర్శిటిలలో మేధావులను ఇబ్బందులకు గురి చేయడం, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వున్న ప్రభుత్వాలను పడగొట్టడం లాంటి విధానాలను అవలంభిస్తుందన్నారు. అయితే ప్రజలు కొత్త విధానంతో త్వరలోనే బిజెపిని తరిమికొడుతారన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆలస్యంగా కళ్లు తెరుచుకున్నాయని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ ఏర్పాటుకు నిధులు, విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు, అనంతపురం, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు, రాష్ట్రంలో లోటు బడ్జెట్‌ను పూడ్చాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చెందుకు క్యాబినెట్ సమావేశంలో మంత్రులను కలిశారన్నారు. రాష్ట్రంలో నెలకున్న పరిస్థితులను నిరసిస్తూ ఉగాది పర్వదినాన ఉగాది దీక్షలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వర రావు, జనసేవా దళ్ రాష్ట్ర కన్వీనర్ నార్ల వెంకటేశ్వర రావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్, జిల్లా సమితి సభ్యులు పిసి రామాంజినేయులు, నియోజకవర్గ కన్వీనర్ గోవిందు, కర్నూలు జిల్లా కార్యదర్శి రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.