అనంతపురం

నేడు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, సెప్టెంబర్ 9 : ప్రత్యేక హోదా కోసం రాష్టవ్య్రాప్తంగా నేడు చేపట్టిన బంద్‌ను జిల్లాలో విజయవంతం చేయాలని ప్రతిపక్షాలు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా రెండో రోజు శుక్రవారం సిపిఐ, సిపిఎం , వైకాపా, కాంగ్రెస్, ఆయా పార్టీల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి. అనంతపురంలో సిపిఐ, ఎఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో క్లాక్ టవర్ వద్ద మానవహారంతో పాటు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎస్‌కె యూనివర్సిటీలో ఐక్య విద్యార్థి సంఘం నేతృత్వంలో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ధర్మవరంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మోకాళ్లపై నిరసన వ్యక్తం చేశారు. గుత్తి, కదిరిలో ప్రతిపక్షాలు సమావేశం ఏర్పాటు చేసి నేటి బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి. మడకశిరలో ఎపి పిసిసి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు. ఇకపోతే నేడు చేపట్టనున్న బంద్‌లో నగరంతోపాటు పలు పట్టణాల్లో ర్యాలీలు, బైకు ర్యాలీలు నిర్వహించేందుకు కార్యచరణ రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా భవిష్యత్తు కార్యచరణపై కూడా నేడు ప్రతిపక్ష నాయకులు, మేథావులు, ఐక్య విద్యార్థి సంఘాల నేతలు చర్చించి నిర్ణయం తీసుకోవడానికి సిద్ధం అయ్యారని తెలుస్తోంది.