అనంతపురం

నగరంలో పందులు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, సెప్టెంబర్ 19: నగరంలో విష జ్వరాల ప్రభావం అంతకంతకు పెరిగిపోతుండటంతో వీటిని నివారించేందుకు తక్షణమే పందుల యజమానులు స్వచ్ఛందంగా తరలించాలని మున్సిపల్ కమిషనర్ చల్లా ఒబిలేసు పేర్కొన్నారు. సోమవారం కమిషనర్ విలేఖరులతో మాట్లాడుతూ మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్‌లాంటి సీజనల్ వ్యాధులకు పందులు కూడా ఒక కారణమవుతున్న దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకోవటం జరిగిందన్నారు. చైనె్న నుండి వచ్చిన బృందం బుడ్డప్ప నగర్, జీసెస్ నగర్, అశోక్ నగర్, నవోదయ కాలనీ, హౌసింగ్ బోర్డు, రామ్‌నగర్, మారుతి నగర్, అరవింద్ నగర్, కృపానంద నగర్, విద్యుత్ నగర్ కాలనీలు, ఒకటవ రోడ్డు నుండి 5వ రోడ్డు వరకు ఒక్క రోజే దాదాపు 180 పందులను పట్టి చెనె్నకు తరలించామన్నారు. అనంతసాగర్‌లో ఏర్పాటుచేసిన షెడ్లకు స్వచ్ఛందంగా పందులను తరలించాలని పేర్కొన్నారు. నగరంలోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్స్, సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ కాలేజీలలో మిగిలిన (వేస్టు) ఆహారాన్ని మున్సిపల్ కార్పొరేషన్ వారి సొంత ఖర్చులతో తరలించి పందులకు ఆహారంగా వేయడం జరుగుతుందన్నారు.