అనంతపురం

జిల్లాకు 50వేల క్వింటాళ్ల పప్పుశెనగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, సెప్టెంబర్ 23: జిల్లాకు 50 వేల కింటాళ్ల పప్పుశెనగ విత్తనాలు వచ్చినట్లు జాయింట్ కలెక్టర్-2 సయ్యద్ ఖాజామొహిద్దీన్ తెలిపారు. ఇందులో ఎపి సీడ్స్ ద్వారా 30వేల క్వింటాళ్లు, ఎపి ఆయిల్ ఫెడ్ ద్వారా 20వేలు క్వింటాళ్లు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసినట్లు తెలిపారు. 2016-17 సంవత్సరం రబీకి సంబంధించి పప్పుశెనగ పంపిణీపై శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎకరాలోపుపొలం ఉన్న రైతులకు 25 కిలోలున్న ఒక బ్యాగు(సంచి), ఆపైన పొలం ఉన్న రైతు గరిష్టంగా రెండు బ్యాగులు (50కిలోలు) పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 25 కిలోల బ్యాగు పూర్తి ధర రూ.2,466.50 పైసలుకాగా, సబ్సిడీ 986.50 పోను రూ.14.80 పైసలు రైతులు చెల్లించాల్సింది ఉంటుంది. అలాగే 50 కిలోల బ్యాగు పూర్తి ధర రూ.4,933 కాగా సబ్సిడీ 19.73పోను రూ.29.60 పైసలు చెల్లించాలి. ఈ నేపథ్యంలో రానున్న రెండు రోజుల్లో 27 మండలాల్లోని ఏజెన్సీలు నిర్ధారించే గోడౌన్లలో 50 శాతం విత్తనాలను సరఫరా చేసి నిల్వ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పంపిణీ కేంద్రాల వద్ద అవసరమైన చోట శామియానాలు, బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. విత్తన సంస్థలు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలన్నారు. వచ్చిన స్టాకును మండల వ్యవసాయశాఖాధికారులు పరిశీలించి, యాక్ట్ శ్యాంపిల్స్, సర్వీస్ శాంపిల్స్ తీయాలని, మొలక శాతం పరిశీలించిన తర్వాత గిడ్డంగుల్లో నిల్వ చేయాలని సూచించారు. స్కాన్ చేసిన కూపన్లను అదే రోజు రీ కాన్సిల్ చేసుకోవాలని, స్కాన్ కాని కూపన్లను అదేరోజు ఎన్‌ఐసి వారికి పంపి జమ చేయించాలని జెడిఏ శ్రీరామమూర్తి ఆయా విత్తన ఏజెన్సీలకు సూచించారు. ఈ సమావేశంలో ఆయిల్‌ఫెడ్ జిల్లా మేనేజర్లు యు.పరమేశ్వరయ్య, ఎస్. ఏకాంబరరావు, ఎపి సీడ్స్ జిల్లా మేనేజర్ పివి.కోటేశ్వరరావు, సంయుక్త వ్యవసాయ పంచాలకుల కార్యాలయ వ్యవసాయాధికారి పి.వెంకటప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ జి.్ఫల్గుణ, నేషనల్ ఇన్‌పర్‌మేషన్ సెంటర్ (ఎన్‌ఐసి) అధికారి కె.రాజా పాల్గొన్నారు.