అనంతపురం

నిస్వార్థ సేవాతత్పరుడు జగ్జీవన్‌రామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, ఏప్రిల్ 5: దళితుల ఆశా జ్యోతి, సమసమాజం కోసం కృషి చేసిన డా.బాబూ జగ్జీవన్‌రామ్ నిస్వార్థ సేవా తత్పరుడని, ఆయన ఆశయాలను కొనసాగించాలని మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. జడ్పీ హాలులో మంగళవారం జగ్జీవన్‌రామ్ 109వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళిత వర్గాల ఆశాజ్యోతి, పరిపాలన దురంధరుడు, దళిత హక్కుల పరిరక్షకులుగా జగ్జీవన్‌రామ్‌ను కొనియాడారు. మహానీయుల జయంతి, వర్థంతి కార్యక్రమాల్లో సంక్షేమ వసతి గృహాల విద్యార్థులను భాగస్వామ్యం చేసి, మహానీయులను ఆశయాలను వినిపించాలన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్ అనేక పదవులను చేపట్టి సమర్థవంతంగా నిర్వహించారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దళిత అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. అన్ని కులాల వారు మనవారే అనే భావనతో ప్రతి ఒక్కరు రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు. శ్మశానవాటికలు దేవాలయాల్లా ఉండాలని, అన్ని కులాల వారు కలసి ఒకే శ్మశానంలో ఖననం చేసే విధంగా తన స్వగ్రామమైన వెంకటాపురంలో ఏర్పాటుచేశామన్నారు. దళిత విద్యార్థుల అభివృద్ధి కోసం వసతి గృహాలను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారుస్తామన్నారు. ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకతన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి జగ్జీవన్‌రామ్ విశేష కృషి చేశారన్నారు. హిందూపురం ఎంపి నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ ఆశయాలను కొనసాగిస్తామన్నారు. జడ్పీ చైర్మన్ చమన్ మాట్లాడుతూ మహానీయుల త్యాగాలను మరువరాదన్నారు. ఈ కార్యక్రమంలో విప్ యామినీ బాల, ఎమ్మెల్సీలు శమంతకమణి, గేయానంద్, ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి, జెసి-2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్ పలువురు అధికారులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో...
అనంతపురంటౌన్ : మాజీ ఉప ప్రధానమంత్రి స్వర్గీయ జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు ఎనలేనివని పలువురు వక్తలు కొనియాడారు. మంగళవారం స్థానిక పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు కాంగ్రెస్ భవన్‌లో జగ్జీవన్‌రామ్ జయంతి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ నగర కమిటీ అధ్యక్షుడు దాదాగాంధి అధ్యక్షతవహించారు. తొలుత జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరాగాంధీ క్యాబినెట్‌లో రక్షణ మంత్రిగా విధులు నిర్వహించారన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపిగా, వివిధ శాఖల మంత్రిగా సమర్థవంతంగా పదవులు నిర్వహించి పేరుతెచ్చుకున్నారని అన్నారు. పదవులకు వనె్న తెచ్చి అందరిచేత శభాష్‌యని ప్రశంసలు పొందారన్నారు. దళిత వర్గాల అభ్యున్నతికై శ్రమించారన్నారు. ఆయన సేవలను స్మరించుకుంటూ ఆశయాల సాధనకై కృషి చేసినపుడే నిజమైన నివాళి అర్పించినట్లవుతుందన్నారు. ఈ సమావేశంలో నేతలు శంకర్, జనార్ధన్‌రెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు.