అనంతపురం

మీ ఇంటికి మీ రేషన్’లో మాయాజాలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, అక్టోబర్ 9 : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీ ఇంటికి మీ రేషన్ పథకం అభాసుపాలవుతోంది. ప్రతినెలా రేషన్ దుకాణానికి రాలేని అభాగ్యులకు ఇళ్ల వద్దకే వెళ్లి సరుకులు ఇవ్వాలన్నది ఈ పథకం లక్ష్యం. అయితే డీలర్ల పుణ్యమా అని ఈ పథకం నీరుగారిపోతోంది. ముఖ్యంగా కుష్ఠువ్యాధిగ్రస్థులు, మంచంపై ఉండిపోయి కదలలేని వారు, వయో వృద్ధులు, ఒంటరిగా ఉన్న వారు తదితరులకు ఇళ్ల వద్దకే సరుకులు చేర్చాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా 11,28,162 రేషన్ కార్డులున్నాయి. వీటికి బియ్యం, చక్కెర, గోధుమలు, ఆటా, కందిపప్పు తదితరాలను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. రేషన్ దుకాణం నుంచి నిత్యావసరాలు తెచ్చుకోలేని వారు సుమారు 4వేల మంది పైగానే ఉన్నట్లు అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. ఈమేరకు నిత్యావసరాలను ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకూ విధిగా కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఈప్రక్రియ జిల్లాలో సక్రమంగా సాగడం లేదు. ఈ-పాస్ విధానం ద్వారా రేషన్ సరఫరా చేస్తున్నందున వేలిముద్రలు తప్పక వేయాల్సి ఉంది. ఈక్రమంలో చౌకదుకాణాలకు రాలేని వారి ఇళ్ల వద్దకు వెళ్లి నిత్యావసరాలు అందజేయడంలో డీలర్లు అలసత్వం వహిస్తున్నారు. ఒక్కో డీలర్ పరిధిలో కనీసం ఐదారుగురు దాకా ఉంటారు. అయితే అక్కడక్కడా కొందరికి అందజేస్తున్నా, మెజార్టీ డీలర్ల నుంచి సరుకులు అభాగ్యులకు అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో గ్రామం, వార్డుల్లో వారి ఇరుగుపొరుగు వారి సహాయంతో సరుకులు తెప్పించుకుంటున్నారు.
నగరం, మున్సిపల్ ప్రాంతాల్లో మరీ ఘోరం..
అనంత నగరంతోపాటు మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంటోంది. ఎవరో ఒకరిని సహాయకుడిగా తీసుకుని, లేదా ఒంటరిగానే ఆటోలో చౌకదుకాణానికి చేరుకుని సరుకులు పొందుతున్న వారు అనేక మంది ఉన్నారు. డీలర్లకు వీరి ఇళ్లు తెలియకపోవడం, తెలిసినా సరుకుల పంపిణీకే సమయం కేటాయిస్తుండటం, అద్దె ఇళ్ల కారణంగా కొందరు లబ్ధిదారులు ఇళ్లు మారి ఉండటం, రేషన్ కార్డులను దూరంగా ఉన్న చౌకదుకాణానికి కేటాయించి ఉండటం వంటి కారణాల వల్ల మీ ఇంటికి మీ రేషన్ కింద అర్హులకు సరుకులు అందడం లేదు. ఇక కుష్ఠు వ్యాధిగ్రస్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. కొందరికి వేళ్లకు వ్యాధి సోకడంతో వేలి ముద్రలు పడే పరిస్థితి లేదు. దీంతో డీలర్లు వారికి రేషన్ ఇవ్వడం లేదు. ఫలితంగా వారు సరుకులు అందక ఇబ్బందికి గురవుతున్నారు. ఈ సమస్యను ఇటీవల మీకోసం-ప్రజావాణిలో కుష్ఠువ్యాధి బాధితులు జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం వద్ద మొరపెట్టుకోగా ఆ సమయంలో మంత్రి పల్లె రఘునాథరెడ్డి సైతం ఉండటంతో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే సాంకేతికంగా ఇబ్బందులున్నందున ఇలాంటి వారందరికీ వేలిముద్రలతో పని లేకుండా స్థానిక విఆర్‌ఓ సమక్షంలో రేషన్ ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు.
రెవెన్యూ డివిజన్ల వారీగా అర్హుల కుదింపు..
ప్రభుత్వం మీ ఇంటికి మీ రేషన్ కింద సరుకులు సరఫరా చేసేందుకు అర్హుల జాబితాను కుదించింది. ఒక్కో రెవెన్యూ డివిజన్‌కు ఐదారు వందల మంది అసలైన అర్హుల్ని గుర్తించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అనంతపురం, పెనుకొండ, కళ్యాణదుర్గం, ధర్మవరం, కదిరి రెవెన్యూ డివిజన్లలో జాబితా పంపాలని డివిజనల్ స్థాయి అధికారులు సంబంధిత సిఎస్‌డిటీల నుంచి వివరాలు కోరుతున్నారు. ఈ లెక్కన అన్ని డివిజన్లకు కలిపి రెండున్నర వేల మందిలోపే తేలనున్నట్లు అంచనా. ఈ పరిస్థితుల్లో డీలర్లు వారికి అనుకూలంగా ఉన్న వారి పేర్లు పంపే పరిస్థితి లేకపోలేదన్న విమర్శలున్నాయి. ఈ విషయంపై అధికారులు సైతం తాము ఏం చేయగలమంటూ చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికైనా అర్హులందరికీ నిత్యావసర సరుకులు అందేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.