అనంతపురం

‘పురం’ టిడిపిలో గుంభనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, అక్టోబర్ 20 : తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటున్న నియోజకవర్గంలో నేతల నడుమ అంతర్గత కలహాలు ‘చాపకింద నీరు’లా రాజుకుంటున్నాయి. గతంలో టిడిపికి మంచి పట్టు ఉన్న చిలమత్తూరు మండలంలో ఇటీవల కాలంగా పార్టీ శ్రేణుల నడుమ అనైక్యత చోటు చేసుకుంటోంది. ఆ మండలంలో ఒకరిద్దరు నాయకుల హవా సాగుతుండగా సీనియర్ నాయకులు నిమ్మకుండిపోతున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అసంతృప్తికి గురైన రంగారెడ్డి మండల కన్వీనర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా చేసి దాదాపు సంవత్సరం అవుతున్నా ఎమ్మెల్యే బాలకృష్ణ పెద్దగా జోక్యం చేసుకోకపోగా ఇప్పటికీ పదవిని భర్తీ చేయలేకపోయారు. దీనికితోడు ఆ మండలంలో ఒకరిద్దరు సీనియర్ నాయకులు మినహా పార్టీ వ్యవహారాల్లో మిగిలిన వారు పెద్దగా జోక్యం చేసుకోవడం లేదన్న చర్చ సాగుతోంది. ఇక లేపాక్షి మండలంలో ఇదేతరహాలో పెత్తనం సాగుతున్నట్లు పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ఆవేదన ఆయా నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టికి పార్టీ వ్యవహారాలు తీసుకెళ్లేందుకు సీనియర్ నాయకులు సాహసించలేకపోతున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ పరిధిలో చైర్‌పర్సన్ వర్గీయులు ఓవైపు అభివృద్ధి పనులు మరోవైపు పార్టీ పరంగా ముందుకెళ్తున్నా పరోక్షంగా అడ్డుకట్ట వేసేందుకు బాలయ్యకు అత్యంత సన్నిహితంగా ఉంటున్న ఒకరు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. దీనికితోడు పార్టీలో వివాద రహితుడిగా మెలుగుతున్న బిసి కార్పొరేషన్ చైర్మన్ పామిశెట్టి రంగనాయకులుకు సైతం బ్రేకులు పడినట్లు తెలుస్తోంది. అభివృద్ధి పనుల విషయంలో సీనియర్ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వకుండా తమతో సన్నిహితంగా ఉంటున్న కొందరికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు పార్టీ వర్గీయుల్లో వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉండగా బలమైన ఓ సామాజిక వర్గానికి కొంతకాలంగా ప్రాతినిథ్యం వహిస్తున్న అధికార పార్టీకి చెందిన ఒక నేతను సైతం దూరంగా ఉంచడం, కనీసం ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటనలో కూడా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న వాదన ఆయా వర్గీయుల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో గత జూన్ 29వ తేదీ తర్వాత హిందూపురానికి రానున్న ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే పిఏగా వ్యవహరించిన బాలాజీ ఇటీవలే వివిధ కారణాలతో గతంలో తాను పనిచేస్తున్న ఉపాధ్యాయ వృత్తిలో చేరిపోయారు. ఇందుకు బాలకృష్ణకు అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్న ఓనేతతో విభేదాలే కారణమన్న చర్చ సాగుతోంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు మేరకు బాలాజీ మాతృ సంస్థలో విధుల్లోకి చేరినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నప్పటికీ ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో విసుగు చెంది ఆ నిర్ణయానికి కట్టుబడినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదిఏమైనా హిందూపురం నియోజకవర్గం టిడిపిలో ముసలం చోటుచేసుకుందని చెప్పవచ్చు.

శాశ్వత తాగునీటి సరఫరా
* డిసెంబర్ ఆఖరుకు హిందూపురానికి హంద్రీనీవా నీరు
* జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో మంత్రులు

అనంతపురం, అక్టోబర్ 20 : జిల్లాలో శాశ్వత ప్రాతిపదికన పైపులైన్లు వేసి తాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్‌చార్జి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, పౌర సరఫరాల శాఖ పరిటాల సునీత ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో మంత్రి కామినేని అధ్యక్షతన జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కామినేని మాట్లాడుతూ ఈఏడాది మొదట్లో వర్షాలు బాగా కురవడంతో ఎంతో ఆశతో రైతులు ఖరీఫ్ వేరుశెనగ పంట సాగు చేశారని, అయితే తర్వాత వర్షాలు సరిగా కురువకపోవడంతో పంట ఎండిపోయిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రెయిన్‌గన్ల ద్వారా రక్షక తడులు అందించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. వచ్చే ఏడాది ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సిఎం ప్రత్యేక దృష్టితో హంద్రీనీవా పూర్తికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా పైపుల ద్వారా తాగునీరు సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకలకు పెంచుతామన్నారు. మంత్రి పల్లె మాట్లాడుతూ హెచ్చెల్సీ కింద వేసిన పంటలు కాపాడేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. నల్లమాడ, ఓడిసి మండలాలకు హంద్రీనీవా నీటిని తీసుకొచ్చేందుకు పనులు వేగవంతం చేయాలన్నారు. పుట్టపర్తిలో రూ.15 కోట్లతో చెక్‌డ్యామ్(బ్యూటిఫికేషన్) నిర్మించేందుకు చర్యలు వేగవంతం చేయాలన్నారు. మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ ఉరవకొండ, రాయదుర్గం ప్రాంతాల్లో వరి పంట ఎండిపోతోందన్నారు. పంటలను కాపాడాలని సూచించారు. హంద్రీనీవా రెండో విడత నిర్మాణం త్వరగా పూర్తి చేస్తామన్నారు. జీడిపల్లి నుంచి గొల్లపల్లి వరకూ నీటిని తీసుకుపోతున్నామని, ఈమధ్యలో ఉన్న అన్ని చెరువుల్ని నింపడం ద్వారా భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. డిసెంబరు ఆఖరుకు హిందూపురానికి నీటిని తీసుకొస్తామన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ఇప్పటికే 11 చెరువులు, 43 చెక్‌డ్యామ్‌లు నీటితో నింపామన్నారు. కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ ఈఏడాది హెచ్చెల్సీకి 9 టిఎంసిలు మాత్రమే నీరు వస్తోందని, అంతేకాకుండా ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిలో విడుదల చేస్తున్నారన్నారు. ఖరీఫ్ వేరుశెనగ సాగు చేసిన రైతుల్ని ఆదుకునేందుకు రెయిన్‌గన్ల ద్వారా రక్షక తడులు ఇచ్చామన్నారు. ప్రస్తుతం కందిపంట సాగు చేసిన రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకుంటే 80 శాతం సబ్సిడీని ప్రభుత్వం ఇస్తోందన్నారు. మడకశిర వరకూ నీటిని తీసుకెళ్లేందుకు రెండు రైల్వే క్రాసింగ్‌లు, హిందూపురం వద్ద టనె్నల్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్‌ఇను ఆదేశించారు. కూడేరు మండలానికి ఈనెల 24లోపు పిఎబిఆర్ ద్వారా నీటిని అందిస్తామన్నారు. ఈ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర, చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు, జడ్పీ చైర్మన్ చమన్, విప్ యామినీబాల, ఎంపి నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, శమంతకమణి, తిప్పేస్వామి, ఎమ్మెల్యేలు నందమూరి బాలకృష్ణ, అత్తార్‌చాంద్‌బాషా, గోనుగుంట్ల సూర్య నారాయణ, ఉన్నం హనుమందరాయచౌదరి, జెసి ప్రభాకరరెడ్డి, ఈరన్న, విశే్వశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతులకు పరిహారం చెల్లించాలి
* అంతవరకూ సోలార్ పనులు అడ్డుకుంటాం
* సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు
నంబులపూలకుంట, అక్టోబర్ 20: సోలార్ హబ్ భూములిచ్చిన రైతులందరికీ ఎకరాకు రూ .10 లక్షలు చెల్లించేంత వర కూ పనులు అడ్డుకుంటామని సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యు లు రాఘవులు అన్నారు. గురువా రం మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో సోలార్ హ బ్ భూ నిర్వాసితులతో ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవు లు మాట్లాడుతూ రాష్ట్రంలో అ త్యంత వెనుక బడిన ప్రాంతమై న అనంతపురం జిల్లా రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు మో సపుచ్చి భూములను లాక్కొని అప్పనంగా ఎన్‌టిపిసికి అప్పచెప్పారన్నారు. ఎన్‌టిపిసికి భూ ములను అప్పచెప్పడానికి ముస్టి వేసినట్లుగా రూ. లక్ష ఇచ్చి చేతులు దులుపుకోవడానికి సిద్ధమవడం బాధాకరమని, ఎకరాకు 10 లక్షలు చెల్లించే వరకు సిపిఎం పోరాటం సాగిస్తుందన్నారు. రైతులకు ఎకరాకు రూ.10 లక్షలు చెల్లించేలా ప్రభుత్వం మెడలు వంచడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం పోలీసుల ద్వారా లాఠీచార్జీ చేయించినా ప్రాణాలను పణంగా పెట్టి ఎకరాకు రూ.10 లక్షలను ప్రభుత్వం చెల్లించేలా పోరాటం సాగిస్తామని ఆయన రైతులకు వివరించారు. అదేవిధంగా సోలార్ హబ్‌లో 250 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నా ఇంతవరకు రైతులకు చెల్లించాల్సిన పరిహారం చెల్లించకపోవడం శోచనీయమన్నారు. మరో 750 మెగావాట్లకు సంబంధించిన పనులను జరగనివ్వకుండా అడ్డుకుంటామని, ప్రభుత్వం ఎంతమంది పోలీసులు తీసుకువచ్చినా బెదరకుండానే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా రైతులకు పరిహారం చెల్తిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఇప్పటికే సాగుదారులకు పరిహారం చెల్లింపుపై పలుమార్లు సర్వేలు చేసినా రైతులకు పరిహారం అందించలేదన్నారు. ఇక్కడ ప్రతి విషయంపై కలెక్టర్‌లు నివేదికలు పంపుతున్నా కలెక్టర్ స్పందించపోవడం పై వారు తీవ్రంగా విమర్శించారు. మొద్దు నిద్ర వీడి రైతులకు చెల్లించాల్సిన పరిహారంపై సర్వేలలో తేలిన అంశాలను ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత కలెక్టర్‌పై ఉందని ఆయన వివరించారు. సమావేశం అనంతరం సిపిఎం నాయకులు, రైతులు సోలార్ హబ్‌లోకి ప్రవేశించడానికి ర్యాలీగా తరలివెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ స్టేషన్ వద్దకు సిపిఐ నాయకులు చేరుకోగానే పోలీసులు విచక్షణా రహితంగా సిపిఐ నాయకులు ఈడ్చుకుంటా స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌కు తరలించే సమయంలో జిల్లా కార్యదర్శి రాంభూపాల్, సిపిఎం డివిజన్ కార్యదర్శి రామక్రిష్ణ, మరో కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాంభూపాల్, సిపిఎం డివిజన్ కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి, నాయకులు నల్లప్ప, జెఎన్ నరసింహులు, రైతు సంఘం నాయకులు వెంకటరెడ్డి, మండల నాయకులు నాగరాజు, రామ్మోహన్, నాగిరెడ్డి పాల్గొన్నారు.
సిఐ సస్పెన్షన్‌కు డిమాండ్
భూ నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్న సిపిఎం నాయకులను అరెస్టు చేస్తున్న సమయంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్, డివిజన్ కార్యదర్శి రామక్రిష్ణపై పోలీసులు దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పోలీసులు డౌన్ డౌన్, సిఐని సస్పెండ్ చేయాలంటూ సిపిఎం నిరసనలు తెలిపారు. రూరల్ సిఐ రవికుమార్ తెలుగుదేశం ఏజెంట్‌లాగా విధులు నిర్వహిస్తున్నారంటూ వారు ధ్వజమెత్తారు. సిఐకి పార్టీ పిచ్చి ఉంటే పదవికి రాజీనామా చేసి పార్టీ ఏజెంట్‌లాగా పనిచేసుకోవాలన్నారు. సుమారు మూడు గంటల సేపు సిపిఎం నాయకులు స్టేషన్‌లో నిరసన వ్యక్తం చేసారు. స్టేషన్‌లో ఆందోళన చేస్తున్న సిపిఎం నాయకులు వద్దకు ఆర్‌డిఓ వెంకటేష్, డిఎస్‌పి వెంకటరామాంజినేయులు చేరుకొని సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు, జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌తో మాట్లాడి వారిని శాంతింపచేశారు. తదనంతరం అరెస్టు చేసిన 40 మంది సిపిఎం నాయకులు, కార్యకర్తలను వ్యక్తిగత పూచికతుపై విడుదల చేయడం జరిగిందని ఎస్సై రమేష్‌బాబు వివరించారు.
త్యాగమూర్తి కన్యకాపరమేశ్వరి అమ్మవారు
* మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య
పామిడి, అక్టోబర్ 20: శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు త్యాగమూర్తి అంటూ ఆర్యవైశ్యుల పితామహుడు, తమిళనాడు మాజీ గవర్నర్, ఎపి మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రో శయ్య కొనియాడారు. గార్లదినె్న మం డలం కల్లూరు ఆర్‌ఎస్‌లో గురువారం శ్రీ దేవి పంచాయత సహిత శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ప్రతిష్ఠా మహోత్సవం జరిగింది. కొణిజేటి రోశయ్యతోపాటు రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్, అనంతపురం ఎంపి జె.సి.దివాకర్‌రెడ్డి, ఆర్యవైశ్యుల మహాసభ రాష్ట్ర అధ్యక్ష, ఉపాధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లు, మచ్చా నరశింహులు, గుంతకల్లు మాజీ ఎంఎల్‌ఎ కొట్రికె మధుసూదన్‌గుప్తా, హుడా మాజీ చైర్మన్ కోటా సత్యంలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయాలు రాష్ట్రంలో అక్కడక్కడా ఉన్నాయని కానీ హిందూ సాంప్రదాయ దేవతామూర్తుల దేవాలయాలు అనేకం ఉన్నాయంటూ ప్రజలంతా దేవతామూర్తులను మొక్కుబడులను నెరవేర్చాలంటూ పూజిస్తారని అయితే కన్యకాపరమేశ్వరి అమ్మవారు ఆర్యవైశ్యులకు మాత్రమే పరిమితమయ్యారని తెలియజేసారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా జీవించాలని ఆకాంక్షిస్తూ కల్లూరులో నా మిత్రుడి కుమారుడు రాంప్రసాద్ వారి మిత్రులతో కలిసి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయాన్ని నిర్మించి అందులో విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయటం అభినందించదగ్గ విషయమన్నారు. కన్యకాపరమేశ్వరి అమ్మవారు త్యాగమూర్తి కొనియాడిన ఆయన విష్ణువర్దన్ మహారాజు కన్యకాపరమేశ్వరి అమ్మవారిని చూసి నిన్ను వివాహం చేసుకుంటానంటూ పెద్దలకు కబురంపగా 101 గోత్రాల వారంతా అందుకు సమ్మతించకపోవటం అందుకనుగుణంగా కన్యకాపరమేశ్వరి అమ్మవారు కూడా మహారాజును వివాహం చేసుకునేందుకు అంగీకరించకపోగా ఆత్మాహుతి చేసుకునేందుకు సిద్ధమై అగ్ని ప్రవేశం చేయగా 101 గోత్రాల వారంతా ఆమెతో నడిచారని అందువల్లనే 101 గోత్రాల వారంతా ఆర్యవైశ్యులుగా గుర్తించబడ్డారని వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి విశాలాక్షి, సర్పంచ్ సుంకమ్మ, కల్లూరు ఆర్యవైశ్య సంఘం పాలకవర్గం కాశంశెట్టి రాంప్రసాద్, శ్రీనాథ్, రంగయ్య, నాగరాజు, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, రఘనందనగుప్తా, సత్యనారాయణ, వెంకటసుబ్బయ్య, గిరిబాబు, సురేంద్రనాథ్‌గుప్తా, శేఖర్, సోమశేఖర్, రాము, నాగభూషణం, ఉపేంద్ర, లక్ష్మిప్రసాద్, మురళీధర్‌గుప్తా, రమేష్, ప్రసాద్, నిరంజన్‌గుప్తా, పామిడి సంఘం బి.వి.రత్నమయ్య, నారాయణమూర్తి, నడిమింటి నల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
మహాత్ముని జీవితం యువతకు స్ఫూర్తి
* మాజీ గవర్నర్ రోశయ్య
అనంతపురం కల్చరల్, అక్టోబర్ 20: మహాత్ముని జీవితం యువతకు స్ఫూర్తి దాయకమని, ఆయన బోధనలను నేటి యువత ఆచరించాలని తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పేర్కొన్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే నిమిత్తం ఆయన గురువారం నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా టవర్‌క్లాక్ సమీపంలోని మహాత్ముడి విగ్రహం వద్ద శిలాఫలకాన్ని రోశయ్య ఆవిష్కరించారు. పార్లమెంటు సభ్యులు జెసి.దివాకర్‌రెడ్డి మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి యువత మహాత్మాగాంధీని మరచిపోతున్నదన్నారు. అహింసా సిద్ధాంతం ద్వారా తన వాక్కుతో భారతీయులందరినీ ఏకం చేసి, బ్రిటీష్ వారిని తరిమికొట్టిన మహానీయుడు మహాత్మాగాంధీ అని రోశయ్య కొనియాడారు. మహాత్ముని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు నడుంకట్టాలని, ఆయన బోధనలను ఆచరించాలని పేర్కొన్నారు. అనంతరం కొత్తవూరు అమ్మవారిశాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు రోశయ్యను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొత్తవూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గోపా మచ్చా నరసింహులు, నాయకులు భాస్కరరావు, నాగభూషణం, రఘు, సతీష్, యువజన సంఘం, మహిళా సంఘం సభ్యులు, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. అంతకుముందు రోశయ్య మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను పలకరించారు. కాంగ్రెస్, వైకాపాకు చెందిన పలువురు నాయకులు మర్యాదాపూర్వకంగా రోశయ్యను కలిశారు.
స్వచ్ఛ అనంతకు ఎంపి జెసి శ్రీకారం
* నగరంలో పాదయాత్ర
అనంతపురం కల్చరల్, అక్టోబర్ 20: నగరాన్ని స్వచ్ఛ అనంతగా మార్చేందుకు పార్లమెంట్ సభ్యులు జెసి.దివాకర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నగరంలో గురువారం పాదయాత్ర నిర్వహించారు. పాతవూరు గాంధీ సర్కిల్ నుండి తిలక్ రోడ్, శ్రీకంఠం సర్కిల్ మీదుగా టవర్‌క్లాక్ వరకు షాపు యజమానులకు స్వచ్ఛ అనంతపై అవగాహన కల్పిస్తూ పాదయాత్ర నిర్వహించారు. రోడ్డుపై బడిన టీ కప్పులు, ప్లాస్టిక్ కవర్లను ఏరుతూ ప్లాస్టిక్ కవర్లను వాడవద్దని, ప్రతి షాపు ముందు చెత్తబుట్టను ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. రోడ్లపై, కాలువల్లో చెత్తవేయరాదన్నారు. స్వచ్ఛ అనంతగా మార్చేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని, నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సకాలంలో పరిహారం అందజేస్తాం
* మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
కళ్యాణదుర్గం, అక్టోబర్ 20 : రైతులకు రావాల్సిన పంట నష్టపరిహారం సకాలంలో అందజేయడానికి చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గురువారం స్థానిక మార్కెట్ యార్డులో రూ. 90 లక్షలతో నిర్మించిన గిడ్డంగిని మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరితో కలసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తోందన్నారు. రైతుల అవసరం కోసం మార్కెట్ యార్డుల్లో గిడ్డంగులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో రైతులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ రుణాలను ఒక కుటుంబానికి రూ.1.50 లక్షలు మాఫీ చేసినట్లు తెలిపారు. హంద్రీనీవా పనులు పూర్తయితే జిల్లా నుంచి కరవును శాశ్వతంగా తొలగించవచ్చన్నారు. నియోజకవర్గంలోని 114 చెరువులకు సాగునీరు ఇవ్వడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఉన్నం మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన గిడ్డంగులను రైతులు వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి, ఓర్వలేకనే ప్రతిపక్షపార్టీలు ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపించారు. అభివృద్ధి కోసం భీజం వేస్తే, వెంటనే అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామారావు, మార్కెట్ యార్డు చైర్మన్ బాదన్న, డైరెక్టర్లుతో పాటు, ఎమ్మెల్యే తనయుడు మారుతీచౌదరి, జడ్పీటీసీ కొల్లాపురప్ప పాల్గొన్నారు.
రాష్ట్భ్రావృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తున్న బిజెపి
* ప్రత్యేక ప్యాకేజీపై ప్రజల్లో అవగాహన కల్పించాలి
* మంత్రి కామినేని శ్రీనివాస్
అనంతపురం సిటీ, అక్టోబర్ 20: ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్భ్రావృద్ధికి భారతీయ జనాతా పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. గురువారం స్థానిక బిజెపి జిల్లా కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు జె.అంకాల్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా పథాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కామినేని, బిజెపి రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ నాయకులు పార్థసారథి, బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సి.విష్ణువర్థన్‌రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కామినేని మాట్లాడుతూ నూతన రాష్ట్భ్రావృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన మొత్తాన్ని కేంద్రం ఇవ్వనున్నదని, అలాగే నూతన రాష్ట్ర పురోగాభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజిని ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతిపక్షం వైఎస్‌ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు పనిగట్టుకుని కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తగదన్నారు. ప్రత్యేక ప్యాకేజిపై వైకాపా, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న ఆరోపణలు భాజపా నాయకులు, కార్యకర్తలు తిప్పకొట్టాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక ప్యాకేజీతోనే రాష్ట్భ్రావృద్ధి జరుగుతుందనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. రాష్ట్భ్రావృద్ధిలో భాగంగానే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కృషి వలన మెట్రో రైలు, 13 విద్యాసంస్థలు ఏర్పాటుచేసుకోగలిగామన్నారు. అలాగే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు బిజెపి నాయకులు సన్నద్ధులై ఉండాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థినికానీ, టిడిపి అలెయన్స్ అభ్యర్థినికాని గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిగ్రీ పూర్తి చేస్తున్న ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు అంబటి రాంబాబు, లలిత్‌కుమార్, సందిరెడ్డి శ్రీనివాసులు, మల్లీశ్వరీ, ఉమాదేవి, నగర అధ్యక్షుడు శ్రీనివాసులు, ఓలేటి రత్నమయ్య, ఇతర జిల్లా పధాధికారులు తదితరులు పాల్గొన్నారు.

వ్యక్తి దారుణహత్య
ధర్మవరంరూరల్, అక్టోబర్ 20: పట్టణంలోని కేతిరెడ్డి కాలనీకి చెందిన ఎరికల శ్రీరాములు (33) బుధవారం అర్దరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే పట్టణంలోని కేతిరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న శ్రీరాములు పీర్ల పండుగ ఉత్సవాన్ని చూసుకొని తన తల్లి వద్ద రూ.3వేలు డబ్బు తీసుకొని ఇంటి నుంచి బుధవారం సాయంత్రం బయటకు వచ్చాడు. రాత్రి ఇంటికి చేరలేదు. అయితే ఉదయమే ఎల్3 కాలనీ సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్‌పై పడి ఉండడంతో సమీప ప్రజలు గమనించి విషయాన్ని పోలీసు, రెవెన్యూ అధికారులకు తెలియజేశారు. శ్రీరాములును గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి ట్రాక్‌పై పడవేసినట్లు గుర్తించిన అధికారులు హిందూపురం రైల్వే పోలీసుల ఆదేశాల మేరకు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
వ్యక్తి అనుమానాస్పద మృతి
ఓబుళదేవరచెరువు, అక్టోబర్ 20: మండల పరిధిలోని వణుకువారిపల్లికి చెందిన పందిపోటు వెంకటరమణ (50) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల మేరకు.. 18వ తేదీ సాయంత్రం అదే గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులతో కలిసి వంతెనపై మద్యం సేవించారన్నారు. అయితే వంతెన పైనుండి వెంకటరమణ వున్నపళంగా కిందకు పడగా స్పృహ కోల్పోయారన్నారు. స్నేహితుల సమాచారం మేరకు భార్యా బిడ్డలకు విషయం తెలియజేయగా, వారు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు గొంతు వెనుకభాగం దెబ్బతినిందని, అతన్ని తిరుపతికి తీసుకెళ్లాలని సూచించగా, మార్గమధ్యలో మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. గురువారం భార్య ఫిర్యాదు చేసిందని, ఈమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
మహిళ ఆత్మహత్య
మడకశిర, అక్టోబర్ 20 : మండల పరిధిలోని జిల్లేడుకుంట గ్రామానికి చెందిన రంగమ్మ (27) ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొద్దికాలంగా భార్యాభర్తల నడుమ కుటుంబ కలహాలు ఉండేవన్నారు. ఇందులో భాగంగానే బుధవారం రాత్రి భర్త ఇంటి బయట నిద్రిస్తుండగా రంగమ్మ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. అయితే గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు మంటలను ఆర్పి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. గురువారం ఉదయం ఎస్సై మక్బూల్‌బాషా సంఘటనా స్థలానికి చేరుకుని భర్త నరసప్పతో మృతికి కారణాలను తెలుసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో గొర్రెల కాపరి మృతి
గుంతకల్లు, అక్టోబర్ 20 : గొర్రె పిల్లల మేత కోసం వేపచెట్టు ఎక్కి విద్యుత్ షాక్ తగిలి గొర్రెల కాపరి మృతి చె ందిన ఘటన ఆలస్యంగా వె లుగు చూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు చిప్పగిరి మండలం నేమకల్లు సంఘాల గ్రామానికి చెందిన సుంకయ్య, బాలమ్మ దంపతుల కుమారుడు కురుబ సుధాకర్(23) గత వారం రోజులుగా మండల పరిధిలోని తిమ్మాపురం సమీపంలో గొర్రెలను మేపతున్నారు. ఇందులో భాగంగానే బుధవారం ఉదయం గొర్రెల కాపరులకు వంట చేసే బాధ్యతను స్వీకరించిన సుధాకర్ వంట చేసి, గొర్రె పిల్లలకు మేత కోసం సమీపంలోని వేప చెట్టు ఎక్కాడు. అయితే వేపచెట్టుకు ఆనుకుని ఉన్న 11కెవి విద్యుత్ లైన్ తగలడంతో సుధాకర్ చెట్టుపై నుంచి కిందకు పడి అక్కడిక్కడే మృతి చెందాడు. సుధాకర్‌కు 8 మాసాల క్రితం పెళ్లి కావడంతో భార్యను చూడటానికి తోటి కాపరులకు చెప్పకుండా వెళ్లి ఉంటాడని భావించారు. గురువారం మధ్యాహ్నం అటుగా వచ్చి గొర్రెల కాపరి సుధాకర్ మృతదేహం ముళ్ల పొదల మధ్య పడి ఉండటాన్ని గమణించి, స్థానికులకు సమాచారం అందించాడు. వారు రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వచ్చి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇద్దరు గురుకుల విద్యార్థులు అదృశ్యం!
హిందూపురం రూరల్, అక్టోబర్ 20 : మండల పరిధిలోని మలుగూరు సాంఘిక సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైనట్లు హిందూపురం రూరల్ పోలీసుస్టేషన్‌లో ఉపాధ్యాయులు గురువారం ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పాఠశాలలో చదువుతున్న పరిగి మండలం విట్టాపల్లికి చెందిన రాహుల్‌కుమార్, హిందూపురం పట్టణం లక్ష్మీపురానికి చెందిన శివకుమార్ తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు తెలిపారు. వీరిద్దరూ ఈనెల 17వ తేదీ నుంచి కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఇతర ప్రాంతాల్లో గాలించినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో తల్లిదండ్రుల సమక్షంలో ఉపాధ్యాయులు నారాయణ, నరసింహులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.